ఉర్ధ్వ పుండ్రదారణ శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి..........!!
రోజూ స్నానం చేశాక, శుచిగా వస్త్రధారణ చేసి, భగవంతుని సన్నిధిలో ఆసీనులై ముఖాన, ఇతర శరీర భాగాల్లోను తెల్ల నిలువు బొట్టు, వాటి మధ్యలో ఎర్రని శ్రీ చూర్ణం ధరించడాన్ని శాస్త్రం విధిస్తున్నది.
ఈ ఊర్ధ్వ పుండ్రధారణ ప్రాశస్త్యం, నియమాలు కాత్యాయనోపనిషత్తులోను, వరాహోపనిషత్తులోను వివరించబడి ఉన్నాయి.
బ్రహ్మ కాత్యాయనుడికి ఉపదేశించిన ఉపనిషత్తులో ఇలా తెలుపబడింది...
భగవానుడే శ్వేత మృత్తికా స్వరూపుడై ఉన్న శ్రీరంగం మొదలైన విష్ణు క్షేత్రాల్లో లభించే శ్వేత మృత్తిక(తెల్లని మన్ను)ను తెచ్చి, ఆ తిరుమణిని ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ శుద్ధ జలంతో అరగదీయాలి.
కేశవాది విభవ నామాలను ఉచ్ఛరిస్తూ ప్రతిదినం ఊర్ధ్వ పుండాన్ని ధరించాలి. నాసిక నుంచి ముఖం పై కేశాల వరకు ఉన్నది గాను, నిలిచి ఉండే విష్ణువు రెండు పాదాల వంటి రూపాన్ని కలిగినది గాను నిలువు బొట్టు పెట్టుకోవాలి.
శ్రీ పాదాలనే వృక్షానికి మూలం(పాదం)గా ఒక అంగుళం మేరకు ఉండాలి. దాని నుంచి పుట్టే రెండు శాఖల మధ్య ఒక్క అంగుళం అంతరం ఉండాలి.
అది శ్రీదేవిని నిలిపే హరిద్రా చూర్ణం (హరిని ఆశపడేటట్లు చేసేది)ధరించడానికి ఉన్నది.
సూర్యుని వంటి వర్ణాన్ని కలిగిన ఆ శ్రీ చూర్ణాన్ని బిల్వ ఫలంలో(ఎండిన మారేడు కాయ)ఉంచుకొని, శ్రీ బీజ మంత్రాన్ని చెపుతూ, నీటితో కలిపి సన్నని రేఖలు జీవాత్మ పరమాత్మలకు అధి దేవతలు.
ఇక, వరహస్వామి సనత్కుమారుడికి చెప్పిన ఉపనిషత్తులో ఊర్ధ్వ పుండ్రాలు 12శరీరంలో ఎక్కడెక్కడ ధరించాలో చెప్పబడింది.
లలాటం(నుదురు),
నాభి,
వక్షం,
కంఠం ముందు భాగం,
నాభికి కుడివైపు,
కుడి భుజం,
కుడి బాహువు,
నాభికి ఎడమ వైపు,
ఎడమ భుజం,
ఎడమ బాహువు,
నడుము వెనుక,
కంఠం వెనక,
మిగిలిన దాన్ని శిరస్సుపైన ధరించాలి.
ఈవిధంగా సుషుమ్నా నాడిని అనుసరించి ద్వాదశోర్థ్వ పుండ్రాలు ధరించేవారు ముక్తి పదాన్ని పొందుతారు.
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
సర్వేజన సుఖినోభావంత్
#తెలుసుకుందాం #ఆచారాలు సాంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #గోవిందా గోవిందా


