*_ఇది సినిమా కథ అని భ్రమపడకండి. ఎందుకంటే ఏ సినిమా రైటర్ కూడా ఇంత దారుణమైన కష్టాలను ఊహించలేడు. ఏ డైరెక్టర్ కూడా ఇంతటి ఎమోషన్ ని స్క్రీన్ మీద చూపించలేడు._*
*_ఇది ఒక ఆడది.. అగ్నిపర్వతంలా మారిన కథ_*.
*సమాజం "ఛీ, కుక్క" అని తరిమేస్తే.. అదే సమాజానికి అమ్మగా మారిన ఒక దేవత కథ.*
*_ఆమె పేరు.._* *సింధుతాయ్ సప్కల్.*
*మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. వర్ధా జిల్లా.*
*అది ఒక అమావాస్య రాత్రి. బయట కుండపోత వర్షం. ఉరుములు, మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి.*
*ఆ ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ గొడ్డు చావిడి అది. లోపల కటిక చీకటి. పేడ వాసన.*
*ఆ బురదలో, ఆవుల మధ్య ఒక 20 ఏళ్ల నిండు గర్భిణి ప్రాణభయంతో వణికిపోతోంది.*
*కొద్దిసేపటి ముందే.. ఆమె భర్త ఆమెను చితకబాదాడు. ఎవరో గిట్టనివాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి, కడుపుతో ఉన్న భార్య అని కూడా చూడకుండా, ఆ నిండు గర్భిణి పొట్ట మీద బలంగా తన్నాడు.*
*"నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు.. పో.. ఎక్కడైనా చావు" అని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఆ గొడ్డు చావిడిలో విసిరేశాడు*.
*పురిటి నొప్పులు మొదలయ్యాయి*.
*అరుపులు గొంతులోనే ఆగిపోతున్నాయి. బయట ఉరుముల శబ్దం.. లోపల ఆ తల్లి ఆర్తనాదం*.
*సహాయం చేయడానికి మనిషి లేడు. మంచి నీళ్ళు ఇచ్చే నాధుడు లేడు*.
*చుట్టూ ఉన్న ఆవులు ఆమె బాధను చూసి దగ్గరకు వచ్చాయి. ఎక్కడ తొక్కుతాయో అని ఆమె భయపడింది. కానీ ఆ మూగజీవాలు ఆమె చుట్టూ రక్షణగా నిలబడ్డాయి*.
*ఆ అర్ధరాత్రి.. ఆవు పేడలో, బురదలో.. ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టింది.. కానీ బొడ్డు తాడు కోయడానికి కత్తి లేదు*.
*_రక్తం కారుతోంది. ఏం చేయాలి?_*
*ఆమె కళ్ళలో నిప్పులు రగిలాయి. పక్కనే పడి ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుంది. తన చేతితోనే.. ఆ రాయిని పట్టుకుని.. దాన్ని బలంగా మోదుతూ, తన కడుపు పేగును తనే తెంచుకుంది*.
*_ఊహించగలరా ఆ నరకాన్ని?_*
*ఒక ఆడది.. అంతకంటే దారుణమైన స్థితిలో ఉండగలదా?*
*అక్కడితో అయిపోలేదు. ఆ రాత్రే బిడ్డను గుండెలకు హత్తుకుని, రక్తమోడుతున్న శరీరంతో కిలోమీటర్లు నడిచింది. తన పుట్టింటికి వెళ్ళింది. కనీసం కన్నతల్లి అయినా చేరదీస్తుంది కదా అని*.
*కానీ ఆ తల్లి, "భర్త వదిలేసిన దానివి.. నీవల్ల మాకు పరువు తక్కువ. పో..* *ఎక్కడైనా చావు" అని ముఖం మీద తలుపు వేసింది. ఇప్పుడు ఆమెకు రెండే దారులు ఉన్నాయి*.
*_ఒకటి ఆత్మహత్య చేసుకోవడం. రెండు.. ఆకలితో చావడం._*
*_ఆమె రైల్వే స్టేషన్లకు వెళ్ళింది. బిచ్చగత్తెలా మారింది._*
*_పగలు రైల్వే ప్లాట్ఫారమ్ మీద పాటలు పాడుతూ బిచ్చం ఎత్తుకునేది. రాత్రి ఎక్కడ పడుకునేదో తెలుసా?_*
*_స్మశానంలో!_*
*అవును. ఎందుకంటే స్మశానంలో దెయ్యాలు ఉంటాయని మనుషులు భయపడతారు. కానీ ఆమెకు దెయ్యాల కంటే మనుషులంటేనే ఎక్కువ భయం.* *"ఇక్కడైతే ఏ మగాడు నన్ను రేప్ చేయడు" అనే నమ్మకంతో శవాల మధ్య నిద్రపోయేది*.
*ఆకలి వేస్తే.. శవాల మీద చల్లిన పిండిని, అక్కడ పడేసిన తిండిని తినేది.*
*కొన్నిసార్లు చలికి తట్టుకోలేక, కాలుతున్న చితిమంటల దగ్గర కూర్చుని చలి కాచుకునేది. ఆమె చేతిలో ఉన్న పసిగుడ్డు ఆకలితో ఏడుస్తోంది. తన కడుపులో పేగులు కాలిపోతున్నాయి.*
*ఒకరోజు.. ఇక బతకడం వేస్ట్ అనిపించింది. రైలు కింద పడి చచ్చిపోదాం అని డిసైడ్ అయ్యింది*.
*అప్పుడే ఆమెకు ఒక దృశ్యం కనిపించింది*.
*ఒక ముసలి బిచ్చగాడు.. ఆకలితో "అమ్మా.. అన్నం" అని అరుస్తూ చనిపోయే స్థితిలో ఉన్నాడు*.
*ఆమె చేతిలో తను బిచ్చమెత్తుకోగా వచ్చిన ఒక రొట్టె ముక్క ఉంది. ఆమె ఆలోచించింది. "నేను ఎలాగూ చచ్చిపోవాలనుకుంటున్నాను కదా*. *చచ్చే లోపు ఈ రొట్టె వాడికి ఇస్తే, కనీసం వాడైనా బతుకుతాడు కదా" అనుకుంది.*
*వెళ్లి ఆ రొట్టె ముక్క వాడి నోట్లో పెట్టింది.* *వాడు కళ్ళలో నీళ్లతో ఆమెను చూసి చేతులు జోడించాడు.*
*ఆ క్షణం.. ఆమెలో ఒక ప్రళయం వచ్చింది.*
*"నా ఆకలి నా ఒక్కదానిదే కాదు. ఈ ప్రపంచంలో ఎంతోమందికి అమ్మ లేదు. ఎంతోమందికి తిండి లేదు. వాళ్ళందరికీ నేను అమ్మను అవుతాను. నేను బతకాలి.. వాళ్ళ కోసం బతకాలి."*
*అంతే.. సింధుతాయ్ సప్కల్ అనే అబల.. "మదర్ ఆఫ్ ఆర్ఫన్స్" గా మారింది*.
*ఆమె రోడ్ల మీద దొరికిన అనాథ పిల్లలను చేరదీసింది. వాళ్ళ కోసం భిక్షాటన చేసింది. "నా పిల్లలకు ఆకలి వేస్తోంది.. ధర్మం చేయండి" అని గొంతెత్తి అరిచింది*.
*ఆమె ఆవేదన చూసి జనం కదిలిపోయారు. డబ్బులు ఇచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అక్షరాలా 1400 మంది అనాథ పిల్లలకు ఆమె అమ్మ అయ్యింది*.
*ఎవరు విసిరేసినా, ఎవరు వద్దన్నా.. వాళ్ళందరినీ తన కొంగులో దాచుకుంది. వాళ్ళని చదివించింది. డాక్టర్లను చేసింది. ఇంజనీర్లను చేసింది. ఆమె పడుకున్న స్మశానం ప్లేస్ లోనే పెద్ద ఆశ్రమాలు కట్టింది*.
*ప్రపంచం మొత్తం ఆమెను నెత్తిమీద పెట్టుకుంది. 750కి పైగా అవార్డులు ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చాయి. భారత ప్రభుత్వం "పద్మశ్రీ" ఇచ్చి గౌరవించింది*.
*కానీ ఈ కథలో అసలైన "ట్విస్ట్" ఇప్పుడు ఉంది*.
*చాలా ఏళ్ల తర్వాత.. ఆమె బాగా ముసలిది అయ్యాక.. ఆమె ఆశ్రమానికి ఒక ముసలివాడు వచ్చాడు*. *చినిగిపోయిన బట్టలు, వణుకుతున్న శరీరం.*
*వచ్చి ఆమె కాళ్ళ మీద పడి బోరున ఏడ్చాడు. "నన్ను క్షమించు సింధు.. నేను పాపాత్ముడిని. నిన్ను గొడ్డు చావిడిలో తన్ని తరిమేసిన నీ భర్తని నేనే. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నన్ను కూడా నీ అనాథాశ్రమంలో చేర్చుకో" అని వేడుకున్నాడు*.
*_ఆ ప్లేస్ లో వేరే ఆడది ఉంటే ఏం చేస్తుంది?_*
*"ఛీ కుక్క.. ఆరోజు నన్ను చంపాలని చూసావ్.. ఇప్పుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చావా?" అని కాలితో తన్ని తరిమేస్తుంది.* *ప్రతీకారం తీర్చుకుంటుంది.*
*కానీ సింధుతాయ్ చేసింది చూస్తే.. మీ గుండె బరువు ఎక్కాల్సిందే*.
*ఆమె నవ్వింది. "నేను ఇప్పుడు కేవలం సింధుని కాదు.. వేల మందికి తల్లిని. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాదంటుంది?" అంది*.
*ఆ ముసలివాడిని లేపి, కన్నీళ్లు తుడిచి..*
*"ఇదిగో.. ఇన్నాళ్లూ నువ్వు నా భర్తవి. కానీ ఈ రోజు నుండి నువ్వు నా భర్తవి కాదు.. నా పెద్ద కొడుకువి. ఈ ఆశ్రమంలో మిగతా పిల్లల్లాగే నువ్వు కూడా నా బిడ్డగా ఉండు" అని చెప్పింది*.
*ఆమె గొప్పతనం చూసి ఆ భర్త అక్కడే కుప్పకూలిపోయాడు*.
*ప్రతీకారం అంటే చంపడం కాదు.. క్షమించి బ్రతకనివ్వడం అని ప్రపంచానికి చాటి చెప్పింది*.
*నీకు కష్టాలు వచ్చాయని ఏడుస్తున్నావా?*
*వర్షంలో, పేడలో, కత్తి కూడా లేని టైంలో రాళ్ళతో బొడ్డు కోసుకున్న సింధుతాయ్ ముందు నీ కష్టం ఎంత?*
*స్మశానంలో శవాల మధ్య రొట్టెలు కాల్చుకుతిన్న ఆమె దారిద్ర్యం ముందు నీ పేదరికం ఎంత?*
*జీవితం నిన్ను ఎంత కిందకి తొక్కితే.. నువ్వు అంత పైకి ఎగరాలి*.
*బంతిని నేలకేసి కొడితేనే అది ఆకాశం వైపు లేస్తుంది.*
*నిన్ను ఎవరైనా అవమానిస్తే.. వాళ్ళని తిరిగి తిట్టకు.*
*నీ సక్సెస్ తో వాళ్ళు సిగ్గుపడి తలదించుకునేలా చెయ్.*
*ఎంతలా అంటే..* *నిన్ను తన్ని తరిమేసిన వాళ్ళే, చివరికి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతుకును అడుక్కునేలా ఎదగాలి.*
*ఆమె దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అందం లేదు, చదువు లేదు.*
*ఉన్నదల్లా ఒక్కటే.. "గుండె ధైర్యం".*
*చావు అంచుల దాకా వెళ్ళావా? పర్లేదు.*
*అక్కడ నుండే అసలైన జీవితం మొదలవుతుంది*.
*లే.. కన్నీళ్లు తుడుచుకో.*
*నీ జీవితాన్ని ఒక చరిత్రగా మార్చుకో. ఎందుకంటే నువ్వు సామాన్యుడివి కాదు.. ఒక యోధుడివి!*
*_నల్లమోతు శ్రీధర్_*
*_గారి పోస్టు_* #మన సంప్రదాయాలు సమాచారం


