జై శ్రీల ప్రభుపాద 🙏🙏🙏
———————————————————
హరే కృష్ణ 🙏🙏🙏
జై శ్రీల ప్రభుపాద 🙏🙏🙏
19-1-26 Sri Chaitanya Krishna Das Prabhu morning class running notes
Topics -
✨lessons to learn from the transformation face of Sri Chaitanya krishnadas Prabhu life
✨భక్తి మూఢనమ్మకం కాదు భక్తి అనేది సైన్స్, transformation
✨శరీర అవసరాల ఆనందం అశాశ్వతం -
ఎందుకు రాధాకృష్ణుల మధ్యన ఉన్న ప్రేమ చాలా ఉన్నతమైనది
1. 3 స్టేజెస్ ఇన్ లైఫ్ -ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రతి విషయాన్ని తన జీవితంలో ఈ మూడు విధాలుగా తెలుసుకొని ఆచరించి పాటించి మారాలి అవి information confirmation transformation ఈ మూడు జీవితంలో ఎవరైతే పాటిస్తారో వారు కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు
2. అంటే ఒక విషయాన్ని కనుక్కోవడం దానిని శాస్త్రాల ద్వారా confirm చేసుకోవడం తర్వాత తెలుసుకున్న విషయాన్ని పాటించి అనుభవించడం అప్పుడు జీవితంలో నిజమైన విజయాన్ని సాధించినట్లు ఈ మూడు స్టేజెస్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి
3. ఉదాహరణకి హరే కృష్ణ మహా మంత్రం గురించి మనం ప్రతిరోజు వింటున్నాము ఎందుకు మంత్రం జపించినప్పుడు ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అని ప్రశ్నించుకోవాలి మంత్రం గురించి వినడం information అవుతుంది మంత్రం గురించి మనకి శాస్త్రం ఏమి చెప్పింది కలిసంతృప్తినిషత్తు ,బృహన్నానరదీయ పురాణము ,శ్రీమద్ భాగవతము భగవద్గీత ఇలా శాస్త్రాల ద్వారా గురు పరంపర ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పుస్తక పఠనం ద్వారా తెలుసుకోవడం దానిని confirmation stage లు విచారించడం జరుగుతుంది తరువాత ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని transformation stage లో ఆ భక్తుడు గురువు శాస్త్రం చెప్పిన నియమాలను పాటించడం ద్వారా పవిత్రమవడం చెడుకి దూరంగా ఉండడం శరీరాన్ని ఏ విధంగా వాడాలి అని తెలుసుకోవడం గురువు భగవంతుడు కృప తెలుసుకోవడం జీవ దయ పెంచుకోవడం ఈ విధంగా వచ్చే మార్పులు అన్నీ అనుభవిస్తారు ఇది అసలైన మానవ జననం యొక్క అర్థం ,విజయం సాధించడం
4. మనము అకామ కర్మ చేయాలి అంటే భగవంతుని ప్రీతిగా సేవ చేయటం సకామ కర్మ అంటే నేను తులసి పూజ చేస్తా నాకేంటి ,భజన చేస్తా నాకేంటి అని ఆశించి కంటికి కనిపించని ఆత్మ గురించి నాకేమీ చెప్పద్దు ముందు నా జీవితంలో నా goals తర్వాత ఆత్మ గురించి మాట్లాడుతానులే అంటూ చేసే మంచి కర్మలే కానీ ఫలితం ఆశించి చేసే కర్మలు సకామ కర్మలు
5. Questions- Enquiry- transformations- lessons——
సకామ కర్మ to అకామ కర్మ shift ——శ్రీ చైతన్య కృష్ణ దాస్ ప్రభు transformation phase ఇలా సకామ కర్మలు చేస్తున్న సమయంలో విశ్వ గురు ఆచార్యులు శ్రీల ప్రభుపాదల వారి యొక్క పుస్తక పఠనం ద్వారా ఇలాంటి లివింగ్ సాధువు చెప్పింది చేసి పాటించాలి అని ఆలోచన విధానాన్ని సకామ కర్మ నుంచి అకామకర్మ కి షిఫ్ట్ చేయడం జరిగింది
6. ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు సంకీర్తన కచ్చితంగా చేయాలి అని చెప్పారు ఎందుకు చేయాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చిన జవాబు ఏ శరీరకానికైనా కనీస అవసరాలు తీర్చాలి .ఆహారం నిద్ర ఇలా శరీర అవసరాలు ఉంది మరి అవసరాలకి ప్రాధాన్యత ఇస్తాము కనుక భక్తి చేయడం కష్టం .కావున విశ్వ గురు శ్రీల ప్రభుపాదుల వారిలాగా ఈ శరీరాన్ని ఆధ్యాత్మికం చేయాలి మన
7. శరీరానికి కనీసం ఆహార నిద్ర వస్త్రం ఇవి కనీస అవసరాలు ఇవి ఎలాగైనా తీరుస్తాము కానీ ఈ శరీరానికి చెడు ఆలోచనలు మైథూనం భయం కోపం ఇవన్నీ నాచురల్ గా వస్తాయి అంటే శరీర అవసరాలు regulated గా ఉండాలి అని అర్థమయింది
8. దానికోసం సంకీర్తన చేస్తే నిలకడగా శరీరం డిమాండ్స్ మారుతాయి అని స్త్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల ద్వారా అర్ధమయ్యింది. శరీర అవసరాలు అణిచి వేయకూడదు బలవంతంగా అలా చేసినప్పుడు వారు పిచ్చివారు అవుతారు ఎందుకంటే హార్మోన్ ఇన్ బాలన్స్ అవుతుంది కనుక
9. బయట వారికి శరీర demands ఖచ్చితంగా fulfill చెయ్యాలి అనే భావనలో ఉంటారు
10. కానీ మనం భక్తులను ఈ మై తునం భయం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అది ఎలా అంటే దీని వెనక మనసు ఉంది దానిని మంత్రంతో కంట్రోల్ చేస్తారు కావున భక్తుడు స్వతహాగా బయటపడతారు దీనిని extraordinary maturity అంటారు ఈ విషయం ఎలా కంట్రోల్ చేయాలి అని ప్రశ్న వేసుకొని రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను
11. బయట restriction regulation లేదు కావున వారు అనుచుకుంటే పిచ్చివారు అయిపోతారు
12. ఒకప్పుడు ప్రేమ వివాహాలు చేసుకున్నా కూడా బాధ్యత తో వారు జీవించేవారు illelegal relationships అనేవి అప్పట్లో లేవు ఇప్పుడు సమాజం అలా లేదు
13. స్త్రీల ప్రభుపాదుల వారు వారి పుస్తకం లో ఈ శరీర అవసరాలు చాలా సులభంగా మనము రెగ్యులేట్ చేసుకోవచ్చు అని గోస్వాముల జీవన విధానం ద్వారా మనకు తెలియచేశారు వారు కేవలం మజ్జిగ తాగుతూ రెండు గంటల సేపు మాత్రమే నిద్రపోతూ రోజుకి 30 కిలోమీటర్లు నడుస్తూ జీవించి చూపించారు
14. స్త్రీల ప్రభుపాదుల వారు తన పుస్తకాలలో మైదునాన్ని జయించాలంటే ఎలా ——అభ్యాస వైరాగ్య ఈ రెండు ఖచ్చితంగా చేయాలి గుడ్డిగా మనలో ఉన్న భావాలని అణిచివేయకూడదు. మరి ఎలా అదే కృష్ణ చైతన్యం బోధిస్తుంది
15. కృష్ణ చైతన్యం గుడ్డిగా పాటించడం కాదు అది ధర్మం .first మన ధర్మాన్ని పాటించి చెప్తారు ఇక్కడ ఇలా చేస్తేనే అది సనాతన ధర్మాన్ని పాటించడం అంటే శ్రీమద్ భాగవతం కానీ భగవద్గీత చైతన్య చరితమృతంలోని రామాయణం ఇలా మన పురాణాలలోని కథలను మన జీవితంలో అప్లై చేస్తాము కృష్ణ చైతన్యంలో
16. మనకు పురాణాల్లో పలాని కథ చదివితే మీకు ఈ లాభం చేకూరుతుంది అని కథ చివరన ఫల శృతి చెప్పబడుతుంది కానీ మనము తత్వాన్ని ఫిలాసఫీని ఆచార్యులు పాటించి చేసి చూపించిన విధానం ద్వారా తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మూల ఫిలాసఫీ అర్థం అవుతుంది దీనివల్ల స్త్రీ పురుష ఆకర్షణ నుండి సులభంగా బయటపడతారు
17. స్త్రీల ప్రభుపాదుల వారు ప్రతి విషయాన్ని హరే కృష్ణ మహా మంత్రాన్ని ఎందుకు సూచించారు ?ప్రభుపాదుల వారు రెండు విషయాలు చెప్తారు అభ్యాసం అంటే 16 మాల మంత్రం జపం ,వైరాగ్యం అంటే నాలుగు నియమాలను పాటించడం అన్నింటికీ ఇదే ప్రభుపాదుల వారు భోదిస్తారు పుణ్యం పాపం ని కూడా పక్కన పెడతారు ఎందుకంటే పుణ్యం కొంచెం సేపు ఉంటుంది అది అయిపోగానే మరలా మామూలుగా ఉంటుంది అలాంటప్పుడు పుణ్యమో పాపము రెండూ ఒకటే స్వర్గం నరకం —స్వర్గం కూడా దుఃఖాలయంలో ఒక భాగం అక్కడ సోమరసం తాగుతారు రోగాలు రావు ముసలితనం రాదు జన్మ మృత్తి ఉంటుంది ఎప్పుడు యవ్వనంగా ఉంటారు అంతే కావున స్వర్గము నరకం కూడా ఒక్కటే ఎవరు స్వర్గంలో శాశ్వతంగా ఉండరు. మనము మరల జననం తీసుకోవలసి ఉంటుంది కాబట్టి స్త్రీల ప్రభుపాదన వారి దృష్టిలో పాపం పుణ్యం స్వర్గం నరకం అంతా ఒకటే
18. కానీ హరే కృష్ణ మహా మంత్రం ఎప్పుడైతే పలుకుతారో అప్పుడు నిజమైన ఆనందం స్వీయ సంతృప్తి పొందుతున్నారు అనే విషయం బోధిస్తారు స్వర్గం నరకం పాపం పుణ్యం ద్వారా అశాశ్వతమైన ఆనందాన్ని చూస్తే హరే కృష్ణ మహా మంత్రం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు ఎందుకంటే ఇది ఆత్మ ఆనందం కాబట్టి
19. అప్పుడు నాకు అర్థమైంది శ్రీమతి రాధాకృష్ణుల వారి మధ్యన ఉన్న నిజమైన ప్రేమ ,నిజమైన ఆనందం ,నిజమైన సేవా తత్వం
20. గోపికలు కృష్ణ మధ్యన ఉన్నటువంటి సంబంధం కూడా ఇదే గోపికలు తమ శరీరాలని ఇంటి దగ్గర వదిలి వారి యొక్క ఆత్మ కృష్ణ భగవాన్తుడితో ఉండడం అది నిజమైన ఆనందం వారు పొందేవారు .ఈ హరే కృష్ణ మహా మంత్రం ద్వారా కూడా అలాంటి ఆనందాన్ని పొందుతాము కనుక అన్నిటికీ ఇదే మూలము అని స్త్రీల ప్రభుపాదుల వారు నిరంతరం ప్రతి విషయానికి హరే కృష్ణ మహా మంత్రాన్ని బోధించేవారు
21. రాధాకృష్ణుల ప్రేమ శరీరం లెవెల్ లో కాదు ఆత్మ ఆనందం level .మనం ఏదైతే హరే కృష్ణ మహా మంత్రం ద్వారా కృష్ణ కావాలి అనే భావనని పొందుతున్నాము అది శరీర సంబంధం లెవెల్ పైన లెవెల్ , next స్థాయి ఆనందం అది
22. శరీరం ఆనందం మై తునం అని ఇదే టాప్ మోస్ట్ అని ఇక్కడ ఆగిపోతారు బయట వాళ్ళు
23. మరి నామం పలికితే ఆత్మ ఆనందం దానికన్నా ఉన్నతమైనది శరీరం దాటి రాధాకృష్ణుల లెవెల్ highest ఆయన నామం ఆత్మ ఫీలింగ్ ఇది జనరేట్ అవుతుంది అని శీల ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాల ద్వారా అర్థం అయినది
24. మరి మై తునం మించిన ఆనందం ఎవరు ఇస్తారు అని question వేసుకున్నాను —-సామాన్యుడు భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే తన కష్టాలు తీరాయి ఉద్యోగం వచ్చింది కోరికలు తీరాయి కావున భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారు అంటే శరీరం కోరికలు ఎవరైతే తీరుస్తారో వారు భగవంతుడు అని గుడ్డిగా నమ్మి వెళ్లడం
25. అలా కాకుండా భగవంతుడు పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉంటారు ఆయన అవ్యక్త రూపం కంటికి కనిపించరు ఎంతో తపస్సు చేస్తే కానీ ఆయన మనకు అర్థం కారు సర్వత్ర వ్యాపించి ఉండి ప్రతి ఒక్కరి అవసరం తీరుస్తున్నారు ప్రతి ఒక్కరిని పోషిస్తున్నారు అలాంటి భగవంతుడిని ఏమీ అడగకుండా ఏమి చేయాలో నేర్చుకోవాలి నేర్చుకొని ఆచరించి పాటించాలి అని అర్థం అయింది
26. ఆనందం అంటే ఏమిటి ?ఆనందం ఎవరు ఇస్తారు శరీర ఆనందం గీతలో ఆత్మ ఎవరు ఎలా దాన్ని అవగతం చేసుకుంటారు అనే ప్రశ్నలకు సర్వ వేదేశ్ దృశ్యతే నాత పరతరో నాణ్యత అంటే అన్ని శాస్త్రాలు వెతికినా brahma నారదుల వారికి చెప్పినది పరమశివుడు పార్వతీదేవితో చెప్పినది మనకు clear గా ఒక ప్రూఫ్ తో శాస్త్రంలో చెప్పబడినది మరి ఎందుకు దీనిని ఎవరు గుర్తించడం లేదు ఒక్క హరే కృష్ణ మహా మంత్రమునే అన్ని శాస్త్రాలు చెబుతున్నప్పుడు దీనిని ఎవరు పాటించడం లేదు అని అర్థమైంది
27. అలాంటి ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దానికి 3 parameters
✨ 1 .నిరంతరం ఎలా ఆనందంగా ఉండాలి
✨ 2.రెండు చెడు అని తెలిసిన వెళ్ళిపోకూడదు
✨ 3. మూడు అందరిలో భగవంతుడు ఉన్నారు
28. నిరంతరం ఆనందం ఎలా దీనికి ఎవరు కరెక్ట్ గా సరితూగుతారు ఎవరు చేసి చూపించారు వారిని మనము ఫాలో అవ్వాలి
29. చెడు చేయకూడదు అసలు చెడిపోకూడదు మోసపోకూడదు మన పవిత్రత పెంచుకునేలా సాధన చేయాలి
30. అందరిలో భగవంతుడు ఉన్నారు. బయట చాలామంది వ్యక్తులు కులం మతం పేరుతో ద్వేషం ని పెంచుకుంటున్నారు ఈ విషయంలో కూడా సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవడం ధర్మం అవుతుంది
31. ఏ సిస్టంలో అయితే ఈ మూడు లేదు అది ఫేక్ అని అర్థం చేసుకోవాలి ఇది మనకు స్త్రీల ప్రభుపాదుల వారు చేసి చూపించారు శ్రీల ప్రభుపాదుల వారు సామాన్యులయిన వారు కారు . వారు కర్మ బంధనములో ఉండరు. కర్మ ఉంటే దుఃఖం ఉంటుంది అంటే మద్యం సేవించకపోతే దుఃఖం ఉండదు. కావున నిత్య ఆనందం ఇదే ఆత్మ తత్వం అంటూ మనకు నాలుగు నియమాల ద్వారా పాటించి చేసి చూపించారు
32. ఈ తత్వాన్ని అందరూ ఒప్పుకుంటారా ? లేదు కేవలం సుమేధా అంటే చాలా చాలా తెలివైన వారు పరిశోధించి పరిశీలించి కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే హరే కృష్ణ మహా మంత్రంని పట్టుకుంటారు వారు ఎవరిని ద్వేషించరు తెలిసింది పాటిస్తారు పవిత్రంగా ఉంటారు ఆ జిజ్ఞాసతో శోధించి తెలుసుకుంటారు ఇదే మనకు వేదంలో మొదటి ప్రశ్న ———-అథాతో బ్రహ్మ జిజ్ఞాస
33. నేను చేసే ప్రార్థన ——-ఓ శ్రీ కృష్ణ భగవానుడు నేను ఎక్కడ ఎవరితోనూ మోసపోకూడదు జినైన్ గా ఉండాలి గుడ్డిగా నమ్మకూడదు నిత్యము నీ ఆలోచనలోనే ఉంటూ సాధన చేసేలా చెయ్యి తుచ్చమైన వాటిలో నిలపకండి స్త్రీల ప్రభుపాదుల వారిలాగా పోరాడినట్లు నన్ను కూడా పోరాడనివ్వు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో నిలబడేలా చెయ్యి ఆత్మ తత్వంలో నిలబడేలా చెయ్యి నిత్య ఆనందంలో నిలబడేలా చెయ్యి నేను నా గురించి ఏదీ కోరను
34. నేర్చుకున్న పాఠాలు ——-చెడు జరిగినా కూడా అది మంచిలోకి వెళ్లే మార్గం, అది కూడా ఒక మెట్టు ,చెడుని సెపరేట్ గా చూడవద్దు జీవితంలో తప్పు అనేది ఏదీ లేదు అది ఒక మెట్టు అని అనుకోవాలి. ఎవరిని ద్వేషించకూడదు
35. ఒక సమస్య వస్తే అది ఒక stage అని అర్థం చేసుకుంటే మానవ శరీరాలకి వచ్చే ఎమోషన్స్ లెవెల్ దాటి దాన్ని దాటి దాన్ని దాటి #🙏🏻కృష్ణుడి భజనలు #భగవద్గీత #🎶భక్తి పాటలు🔱 దాటి దాటి ఒక స్టేజికి వస్తారు అప్పుడు వచ్చిన కష్టాలు వచ్చిన ఎమోషన్స్ ని కూడా పైకి ఎదగటానికి అని అర్థమవుతుంది


