ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు *బాబూ.. మీరు మాట్లాడాల్సిన మాటేనా❓* JANUARY 8, 2026🎯 కరవు నేలలో పుట్టిన వాళ్లకు నీళ్లు, ఆకలి విలువ బాగా తెలుసు. గుక్కెడు నీళ్లు దొరికితే, అవే మహాభాగ్యం అనుకుని తీర్థంలా భావించి నోట్లో పోసుకుంటారు. కరవులుంటే రాయలసీమే గుర్తుకొస్తుంది. రాయలసీమ నుంచి కరవును పారదోలేందుకు దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి శక్తి వంచన లేకుండా, అలాగే ఎన్టీఆర్ కొద్దోగొప్పో కృషి చేశారు. له కానీ అందరి కంటే ఎక్కువగా సీఎం సీట్లో కూచున్న చంద్రబాబు మాత్రం ఎందుకనో, కరవు నేలకు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచనే చేయలేదు. కరవు నేల రాయలసీమలోని బీడు భూముల్ని కృష్ణా జలాలతో తడపాలనే గొప్ప ఆశయంతో వైఎస్ జగర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటికి సంబంధించి 60-70 శాతం పనులు వైసీపీ హయాంలో పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన కూటమి సర్కార్ కొనసాగించలేదు. తాను కోరడం వల్లే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని నిలిపేశారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చావు కబురు చల్లగా చెప్పారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు సందర్శించిన సందర్భంగా చేసిన కామెంట్స్ ఆయనకు మరింత రాజకీయ నష్టం తెచ్చేలా ఉన్నాయి. రేవంత్రెడ్డి కామెంట్స్పై స్పందించకపోవడం ద్వారా, నిజమే అని బలపరిచినట్టు అయ్యింది. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు అనుచిత కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏమన్నారంటే... “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. 20 టీఎంసీల నీళ్లు, దాంతో ఏమవుతుంది?" అని చంద్రబాబు ఆగ్రహంతో ప్రశ్నించారు. 20 టీఎంసీల నీళ్లు అంటే చిన్న విషయం కాదు. ఒక టీఎంసీ నీళ్లతో 10 వేల ఎకరాల్లో పంటల సాగు చేయొచ్చు. అలాంటిది 20 టీఎంసీల నీళ్లతో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకోవచ్చు. లక్షలాది మంది కరవు రక్కసి నుంచి బయట పడొచ్చు. నీళ్ల గురించి చంద్రబాబు కాకుండా, మరే ఇతర కోస్తా నాయకులు మాట్లాడి వుంటే అర్థం చేసుకోవచ్చు. కరవు ప్రాంతంలో పుట్టి, పెరిగిన చంద్రబాబు ఏ మాత్రం బాధ్యత లేకుండా ఏమవుతుందని మాట్లాడ్డం సీమ వాసుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు ఎందుకిలా మాట్లాడారనే ప్రశ్న ఎదురైంది. బాబులో ఎందుకంత ఒత్తిడి అని మాట్లాడుకునే పరిస్థితి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై రేవంత్రెడ్డి కామెంట్స్, అలాగే ఇప్పుడు చంద్రబాబు దబాయింపు ధోరణి. రాజకీయంగా అంతిమంగా టీడీపీకే నష్టం. దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఆలోచించడానికి బదులు, అగ్గికి ఆజ్యం పోసినట్టుగా చంద్రబాబు అనుచిత కామెంట్స్ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
ఏపీ అప్ డేట్స్..📖 - యమేవ జయతే యమేవ జయతే - ShareChat