ShareChat
click to see wallet page
search
*🙏ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి🙏* 🙏\|/ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ మాసంలో శ్రీ కృష్ణుడిని పూజించడం అనేది చాలా ఫలవంతం అవుతుంది. శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసంలో, చిన్ని కృష్ణుడి భజనలు కీర్తనలు వాడటం వల్ల ఆయన కృపా కటాక్ష వీక్షణాలకు నోచుకోవచ్చు. 🙏\|/ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి. ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వపాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 🙏\|/ధనుర్మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇంటింటా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో సంతోషం వెల్లి విరిస్తుంది. 🙏\|/ధనుర్మాసంలో “ఓం శ్రీ కృష్ణాయ నమః “ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు జపించాలి.ఇలా చేయడం ద్వారా మీ మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. 🙏\|/ఈ మాసంలో మీరు తప్పనిసరిగా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని కూడా జపించడం ద్వారా భగవంతుడి ఆరాధన చేయవచ్చు. ధనుర్మాసంలో తగాదాలకు కూడా దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 🙏\|/ధనుర్మాసంలో ప్రతిరోజు గోదాదేవికి పూజ అనగా గోదాదేవి పాశురాలు పటించడం ద్వారా దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని అంతేకాకుండా వివాహం కాని కన్యలకు వివాహం అవుతుంది అని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపారు. 🙏\|/ఈ మాసంలో అనగా ధనుర్మాసంలో గోదారంగనాధులను మరియు శ్రీకృష్ణుని ఆరాధించాలి. ప్రతి రోజు ఆవునేతితో దీపం వెలిగించి, ఆ వెలుతురులో విష్ణు సహస్ర నామం, భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది. 💐💐💐💐💐💐💐💐💐 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #dhanurmasam
తెలుసుకుందాం - ShareChat