🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 25 - 12 - 2025,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పంచమి* ఉ10.42 వరకు
నక్షత్రం : *శతభిషం* తె6.18 వరకు
యోగం : *వజ్రం* మ1.44 వరకు
కరణం : *బాలువ* ఉ10.42 వరకు,
తదుపరి *కౌలువ* రా10.23 వరకు,
వర్జ్యం : *మ1.27 - 3.03*
దుర్ముహూర్తము : *ఉ10.10 - 10.53*
మరల *మ2.32 - 3.16*
అమృతకాలం : *రా11.05 - 12.41*
రాహుకాలం : *మ1.30 - 3.00*
యమగండం : *ఉ6.00 - 7.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం : 6.31,
సూర్యాస్తమయం : 5.28,
*_నేటి పాశురం_*
_*తిరుప్పావై – 10వ పాశురము*_
_*నోత్తు చ్చువర్‍క్కమ్ పుహిగిన్ఱ అమ్మనాయ్!*_
_*మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్*_
_*నాత్తత్తుళాయ్ ముడి*_ _*నారాయణన్; – నమ్మాల్*_
_*పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్; పణ్డొరునాళ్,*_
_*కూత్తత్తిన్ వాయ్ వీళ్‍న్ద కుమ్బకరణనుమ్*_
_*తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?*_
_*ఆత్త అనన్దలుడైయాయ్! అరుఙ్గలమే!*_
_*తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.*_
_*తాత్పర్యము:-*_
మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడిననూ ’పఱ’ అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఒసంగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ! మాకందరకు శిరోభూషణమైనదానా! నిద్రనుండిలేచి మైకము వదలించుకొని, తేరుకుని వచ్చి తలుపు తెఱువుము, నీ నోరుతెరచి మాటాడుము, ఆవరణము తొలగించి నీ దర్శనమునిమ్ము.
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023


