U19 World Cup 2026 : జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం నమోదు
U19 World Cup 2026 : అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఒక అద్భుతం జరిగింది. క్రికెట్ ప్రపంచంలో పసికూనగా భావించే జపాన్ జట్టు చరిత్ర సృష్టించింది. విండ్‌హోక్ వేదికగా జరిగిన 15వ స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ పోరులో జపాన్ అండర్-19 జట్టు, టాంజానియాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో జపాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.