🌿🌼రాత్రి వేళల్లో పూజలందుకునే వారాహీ అమ్మవారు 🌼🌿 శ్రీ వారాహీ మాత స్తోత్రాలు🌼🌿
🌿🌼🙏శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి)🙏🌼🌿
(వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశి విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్టించారు ఆ అమ్మవారిని ఇక్కడి వారు విన్ధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచల్ లో వామాచారం లో కొలుస్తారు ఈ మందిరం లో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్టింపబడింది)
నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం 1 ..
త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం
గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం 2 ..
దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్
వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..
లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం
కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం 4..
కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్
వరం వరాననం శుభం భజామి వింధ్
య వాసినీం 5..
ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం
జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం 6..
విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం
మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం 7..
పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్
విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం 8.
అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయన స్త్రోత్రం గా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది.
తరచూ అనారోగ్యంతో ఉండే వాళ్ళు అష్టోత్తరం తో అర్చన చేస్తే మంచిది, ఈమె ఆయుష్షు ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది, ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి (వైద్యుడు)ఉంటారు
🌿🌼🙏అంతటి కారుణ్య స్వరూపిణి ఈ తల్లి. బ్రహ్మాండ పురాణంలో దేవతలు ఈ తల్లిని 12 నామాలతో కీర్తించారు. ఆ నామాలు స్మరణచేతనే వజ్రకవచంలా అమ్మ యెక్క రక్షణ వలయం మన చుట్టుా ఏర్పడిందని ప్రతీతి🙏🌼🌿
🌿🌼🙏ఆ 12 నామాలకు సంభవించిన శ్లోకం🙏🌼🌿
పంచమీ, దండనాధా చ సంకేతా, సమయేశ్వరీ!
సమయసంకేతా, వారాహీ, హోత్రిణీ, శివా!
వార్తాళీ చ మహాసేనా, ఆజ్ఞాచక్రేశ్వరీ తథా!
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే!
నామ ద్వాదశకాభిఖ్య వజ్ర పంజర మధ్యగః!
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః!!
🌿🌼🙏ఆ 12 నామాలు:🙏🌼🌿
🙏పంచమి.
🙏దండనాధ.
🙏సంకేతా.
🙏సమయేశ్వరీ.
🙏సమయ సంకేతా.
🙏వారాహీ.
🙏పోత్రిణీ.
🙏శివా.
🙏వార్తాళీ.
🙏మహా సేనా.
🙏ఆజ్ఞాచక్రేశ్వరీ.
🙏అరిఘ్నీ
ఆ అమ్మ దయ మనందరిపైనా ఎప్పుడుా ఉండాలని కోరుకుంటూ!..... అమ్మ అందరిదీ- అమ్మ అందరికీ!...
"సర్వేజనాః సుఖినోభవంతు! "
🌿🌼🙏అందరం భక్తి శ్రద్ధలతో " ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః " నామం వ్రాస్తూ అమ్మవారిని స్మరిద్దాం ... మనం ఎంత ఆర్తితో పిలిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత🙏🌼🌿
🌿🌼🙏ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🪔🕉️ అమ్మవారి అనుగ్రహం🙏🚩 #🙏శ్రీ వారాహి అమ్మవారు🕉️


