_ అరసవిల్లిలో మాజీ మంత్రివర్యులు గుండ అప్పలసూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, ఘాట్ నిర్మాణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.నీతి నిజాయితీలకి చిరునామాగా, విలువలకు పెద్దపీట వేసే నాయకుడుగా, అజాతశత్రువుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన అప్పల సూర్యనారాయణ గారు ఇటీవల మరణించడంతో ఆయన విగ్రహాన్ని, ఘాట్ నిర్మాణాన్ని అరసవిల్లి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసారు. ఈ విగ్రహాన్ని, ఘాట్ ను మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ గారి తనయులు గుండ శివగంగాధర్, గుండ విశ్వనాధ్ లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.మాజీమంత్రి అప్పల సూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో అరసవల్లి గ్రామ పెద్దలు, పురజనులు,గుండ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అరసవిల్లి కి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చిన మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారి సేవలను కొనియాడుతూ ఆయనతో వున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు._ #telugudesamparty


