🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 11 - 12 - 2025,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం
*_నేటి మాట_*
*భగవంతుని అనుగ్రహం సంపాదించడానికి ఏమి చేయాలి?*
భగవద్గీతను కన్నులకద్దుకుని మొదటి పేజీ తిప్ప గానే విషాదయోగం మొదలౌతుంది!!...
ప్రతీమానవుడూ పుట్టగానే ఏడ్పుతోను ప్రారంభిస్తాడు, తన జీవితాన్ని, మహాభారత యుధ్ధ సమయంలో అర్జునిని వయస్సు 80 సం. లు. కృష్ణుని కి 84 సం. లు. ఐతే, అంతవరకూ ఎప్పుడూ, అర్జునికి కృష్ణుడెప్పుడూ గీత బోధ చేయలేదు, ఎందుకు?
కాల కర్మ, కారణాలు కలిసి రావాలి, యుధ్ధ సమయంలో అర్జునుడు, " కృష్ణా, నాకు రాజ్యం అక్కరలేదు, పదునాలుగు లోకాలు ఇచ్చి నా వద్దు.
నీ పాదాలు చాలు, నాకు యుధ్దము, రాజ్యాలు నాకు అవసరం లేదు" అని శరణు కోరాడు. " ఇన్నాళ్లూ కాదు ఇప్పుడు నువ్వు నా భక్తుడవు ఇప్పుడు విను" అన్నాడు కృష్ణుడు...
తనను శరణాగతి పొందాలని కాచుకొని ఉంటాడు భగవంతుడు, వైరాగ్యం వచ్చి నపుడు అన్నీ అను గ్రహిస్తాడు.
వైరాగ్యం అంటే ఏ పని నీ మానుకోనక్కరలేదు.
ఏపని చేసినా దైవ కార్యము చేస్తున్నామని భావంతో చేయండి, ప్రతీ ఆలోచనా, ప్రతీ పని నీ దైవం గమనిస్తున్నాడన్న ఎరుక కలిగి ఉండండి.
భగవంతుని సంపదనే నేను అనుభవిస్తున్నాననే కృతజ్ఞత కలిగి ఉండాలి అదే చాలు.
*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023


