ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు,రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ చే వరాలు పొందిన త్రిమూర్తుల స్వరూపం.శ్రీ ఆంజనేయస్వామి వారిని ప్రతి నిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయ. హనుమ కు మంగళ,శని వరాలు అంటే ఎంతో ప్రీతిపాత్రము.. ఇ రెండు రోజులు శ్రద్ద తో స్వామి వారిని కొలిస్తే విశేషామైన ఫలితాలు లభిస్తాయి.
"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.
బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్
చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం. అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి. ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగామరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందు వల్ల భయం లేనితనం.
ఆంజనేయుణ్ణి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం, మనసుకు ఏవిధమైన జడత్వం(నిరాశ నిస్పృహ) లేనితనం, మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం. ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల లభిస్తాయి.
ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్
హనుమంతుడు అంటేనే... బ్రహ్మ,విష్ణు, శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారకుడని, రామదూత అని పేర్కొంటారు. ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే... ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.
ఆంజనేయస్వామివారు తొమ్మిదిఅవతారాలు
-------------------------------------
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
అభిషేకాలు
--------------------
తేనె - తేజస్సువృధ్ధి చెందుతుంది
ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి.
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి చేకూరుతుంది.
ఆవునెయ్యి -ఐశ్వర్యం
విబూధితో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి.
#🚩జై శ్రీరామ 🕉️ #🕉️🚩జై హనుమాన్🕉️🚩 #జై శ్రీరామ #🚩🌺జై హనుమాన్🌺🚩 #🌅శుభోదయం


