#🙏ఓం నమః శివాయ🙏ૐ #ధనుర్మాసం శుభాకాంక్షలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #ధనుర్మాసంలో శివ సుప్రభాతం "ఏలోరెంబావై తిరువెంబావై" #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శ్శివాయ 🙏🙏
ధనుర్మాసం సందర్భంగా శైవి సాహిత్యమైన తిరువెంబావైలోని ఆఖరి పటికం 🙏🙏
గానం రోజు :: 04.01.2025(20వ రోజు)
సాహిత్యం :: శ్రీమాణికవాచగర్
ఓం గం గణపతయే నమః 🙏🙏
ఓం నమః శ్శివాయ 🙏🙏
20వ పటికం ::
పోట్రి అరుళుగ నిన్ ఆది ఆం పాదమలర్
పోట్రి అరుళుగ నిన్ అందం ఆం సెంతళిర్గాళ్
పోట్రి ఎల్లా ఉయిర్కుం తోట్రం ఆం పొన్ పాదం
పోట్రి ఎల్లా ఉయిర్కుం బోగం ఆం పూం కళల్గళ్
పోట్రి ఎల్లా ఉయిర్కుం ఈరు ఆం ఇణై అడిగళ్
పోట్రి మాల్ నానముఖనుం కాణాద పుండరికం
పోట్రి యాం ఉయ్య ఆల్కొండరుళుం పొన్ మలర్ గళ్
పోట్రి యాం మార్గళి నీర్ ఆడు ఏల్ ఓం ఎం పావాయ్ !
తిరుచ్చిట్రంబలం !!
తాత్పర్యం : అన్నింటికీ ఆదిగా ఉన్న నీ పాద పద్మములకు జయము! అనుగ్రహించు! అందంగా ఉన్న ఎర్రని లేత పుష్పదళాల వంటి నీ పాద పద్మములకు జయము! అనుగ్రహించు! అన్ని జీవరాశులకు ఉత్పత్తి స్థానంగా ఉన్న నీ బంగారు పాదాలకు జయము! అన్ని జీవరాశులకూ ఆనందాన్ని ఇచ్చే స్థానమైన నీ పాదసుమాలకు జయము! అన్ని జీవ రాశులూ లయమయ్యే స్థానమైన పాదాల జంటకు జయము! మేము విముక్తి పొందేటట్టు ఏలుకొని అనుగ్రహించే పాదకమలాలకు జయము! మేమ మార్గశిర స్నానం ఆడుటకు అనుగ్రహించిన నీకు జయము! మేలుకో! ఆలోచించు! ఓ చెలీ!
హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏


