ShareChat
click to see wallet page
search
చాలా అరుదుగా దొరికే చిత్రము..శ్రీ మహాలక్ష్మీ దేవి....,......!! లక్ష్మి చేతిలో విష్ణుమూర్తి చేతినుంచి.. కనకధారా కురిపిస్తూ మరియు గరుడవాహనుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రణామములు. ప్రతి నిత్యము లేదా ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం చేయడం ద్వారా కలిగే అద్భుత ఫలితాలు..!! ప్రస్తుతం మనకి ఉన్న పని ఒత్తిడి ద్వారా ప్రతి రోజూ మనం విష్ణు సహస్రనామం పారాయణం చేయలేక పోతున్నాము. కనీసం ఏకాదశి రోజైన విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన మనకి మన ముందు మరియు తరువాతి తరాల వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణఫలం..!! శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. మహావిష్ణు దేవతలందరిలో ఉత్తమోత్తమైన దేవుడు. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు.. చక్రీ సర్వోపగతుండు. ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ప్రతిరోజు విష్ణు నామపారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాలు నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. జ్ఞానానికి,మోక్షానికి దగ్గర దారి శ్రీమహావిష్ణుఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయణం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంతః శతృవులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామపారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి, వాక్శుద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి నొందుతుంది. తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!! #తెలుసుకుందాం #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ
తెలుసుకుందాం - ShareChat