ShareChat
click to see wallet page
search
వసంత పంచమి విశిష్టత…........!! ఈ రోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే. మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి’ అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ సంవత్సరంలో జనవరి 23 న ఈ వసంతి పంచమి వచ్చింది. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు. సరస్వతి దేవికి పూజా విధానం....... వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. “యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః.. ” శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. శ్రీ మాత్రే నమః. #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
"భక్తి సమాచారం" - సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ధవతు . సదా | సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః . శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః . కుటుంబసభ్యులకు  వసంత పంచమి శునాకా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ధవతు . సదా | సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః . శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః . కుటుంబసభ్యులకు  వసంత పంచమి శునాకా - ShareChat