ఆలూమగల అన్యోన్యత కు...............!!
ప్రస్తుత కాలంలో ఎవరికి వారికి స్వతంత్ర
భావప్రకటన వలన, భార్యా భర్తల మధ్య అన్యోన్యత తగ్గి అవి అనేక సమస్యలు వరకు దారి తీస్తున్నాయి.
కలహాలను దూరం చేసుకోటానికి మంత్ర శాస్త్రంలో
కొన్ని మంత్రాలు ఉన్నాయి.
మంత్రాలను జపం చేసుకుంటూ చిన్న చిన్న
సూచనలను పాటించటం వలన భార్యా భర్తల మధ్య కలహాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించవచ్చు.
వివాహానికి జాతక చక్రంలో సప్తమ స్థానం
వివాహ స్థానాన్ని తెలియ చేస్తుంది.
ఈ సప్తమ స్థానంలో పాప గ్రహం ఉన్నా లేక
సప్తమ స్థాన అధిపతి 6,8,12 స్థానాలలో ఉన్నా
దాంపత్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే
అవకాశం ఉన్నది.
అదే సప్తమ స్థాన అధిపతి స్వరాశి లో ఉన్నా,
మిత్ర రాశిలో ఉన్నా, ఉచ్చ స్తితిలో దాంపత్య జీవితం బాగుంటుంది.
సప్తమ స్థానం బాగుగా లేని పురుషులు అయితే
శుక్రుని కి సంబంధించిన మంత్రాన్ని,
స్త్రీలు అయితే బుధుని కి సంబంధించిన
మంత్రాన్ని జపించాలి.
పురుషులు అయితే ‘ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహా ‘ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి,
అదే స్త్రీలు అయితే ‘ ఓం లోహితాక్ష్యానమహ ‘ అనే మంత్రాన్ని పఠించాలి.
దీనితో పాటు పురుషులు అయితే బియ్యాన్ని కాని, పరమాన్నాన్ని కాని ఆవుకు తినిపించాలి.
అదే స్త్రీలు అయితే మంగళవారం నాడు
ఆవుకి బెల్లం తినిపించాలి.
ఇంకా భార్యా భర్తలు కలిసి ఉన్న ఫోటోను పడక గదిలో నైరుతి కోణంలో అమర్చాలి.
దాని వలన కూడ అనుకూలతరంగాలు ఏర్పడి
వైవాహిక జీవితం బాగుంటుంది.
ముఖ్యంగా భార్యా భర్తల మధ్య ఆర్ధిక విషయాల వలన వచ్చే కలహాలను నివారించడానికి సోమవారం నాడు అశొక వృక్షం యొక్క ఆకులను తీసుకుని ఒక గుత్తి లాగా కట్టి ఇలా 21 గుత్తులను తోరణంగా కట్టి
గుమ్మం ముఖద్వారానికి కట్టాలి.
మంగళవారంనాడు ఆ తోరణం తీసి వేసి ప్రవహిస్తున్న నదిలో విడిచి పెట్టాలి.
ఇలా 4 సోమవారాలు చేయాలి.
ఇలా చేస్తే ఆర్ధిక ఆటుపోట్లవలన గొడవలు పడే దంపతుల మధ్య విబేధాలు తొలిగిపోతాయి.
ఒకవేళ భార్యవలన భర్త విడిపోయినా,
భర్త వలన భార్య విడిపోయినా వాళ్ళతో కలిసి ఉండాలని రెండవ వారికి ఉంటుంది, అప్పుడు దానికి సంబంధించిన వశీకరణ మంత్రం ఉంటుంది.
అయితే ఇది కేవలం భార్యా భర్తలకు మాత్రమే. ఉదాహరణకు భర్త భార్యను విడిచి పెట్టాడు అనుకుందాం, కానీ ఆమెకు భర్తతో వెళ్ళాలని ఉంటుంది,
ఇంట్లో పెద్దవారి వలనో లేక మరో కారణం వలనో
వెళ్ళలేరు అలాంటప్పుడు భర్త మనసులో
ప్రేమ కలిగించి భార్య దగ్గరకు తీసుకువచ్చే బలం
మంత్ర శాస్త్రానికి ఉన్నది.
భార్య దీనితో పాటు దుర్గా దేవి దగ్గర ఆవు నేతితో
దీపం వెలిగించాలి.
దీపారాధన చేసి తన భర్త మళ్ళీ కలిసి తనతో జీవించాలి అని బలంగా సంకల్పించుకోవాలి.
ఆమె పడక గదిలో దిండుక్రింద భర్త ఫోటోను
ఒక అద్దం మీద బోర్లా ఉంచి
అద్దం మీద ఫోటోని తీయకుండా దిండు క్రిందే ఉంచుకొని పడుకోవాలి.
అయితే దిండు కింద ఉన్న ఫోటోను,
మీరు చదివే మంత్రం రెండో కంట పడకూడదు.
ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.
ఇది... గురువులు చెప్పినమాట.!!
#తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #🔯దోష పరిహారాలు🔯 #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు


