ShareChat
click to see wallet page
search
🌿🌼🙏దేవతల సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ ఉగ్ర వారాహీ అమ్మవారు వారాహి దేవి నామాలు...ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది 🌿🌼🙏శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం🙏🌼🌿 అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః !అనుష్టుప్ఛందః ! శ్రీవారాహీ దేవతా ! శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం! సర్వ సంకట హరణ జపే వినియోగః !! *1) పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ !* *తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా !!* *2) వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా !* *అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే !!* *3) నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః !* *సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః !!* 🌿🌼🙏ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం🙏🌼🌿 పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా,ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని. "ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ....." లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలు తో పూజించడం, రేవతి నక్షత్రం రోజు విశేష పూజ కు అనుగ్రహిస్తుంది.. ఈమె వాహనం దున్నపోతు,ఉగ్రంగా కనిపించిన ఏమీ చల్లని తల్లి, అన్యాయంగా దౌర్జన్యం గా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించ బడుతుంది.లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు ఉంటారు. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా | జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 || భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా | నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 || భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా | మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 || విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా | అరుణాచలశివ 🌹 ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః🌹🙏🚩 . #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🙏శ్రీ వారాహి అమ్మవారు🕉️
🌅శుభోదయం - Orginal artwork by @rupeshhkumar Reproduction without permission is prohibited Orginal artwork by @rupeshhkumar Reproduction without permission is prohibited - ShareChat