ShareChat
click to see wallet page
search
*శివ*..... ✨💗 *శివ నామస్మరణ మహిమ...* శంకర భగవత్పాదుల వారు శివ అనే రెండు అక్షరాల శక్తిని చెప్తూ.. “శివేతి దౌవర్ణౌ ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే” అన్నారు... శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు. దిత్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు లేవు. ఆ రెండు అక్షరాలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించడమే కాని వ్యాఖ్యానించలేము. 'శి' 'వ' అనేవి రెండు తిరగలి రాళ్ళలా పని చేస్తుంటాయన్నారు. తిరగలి రాళ్ళకి ఒక లక్షణం ఉంది. ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణం అయిపోతాయి. మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి. కాని పిండి చేసి భూమి మీద వేస్తే మరి మొలకెత్తవు. మనకి అనేక జన్మలు మొలకలెత్తడానికి కావల్సిన పాపపుణ్య కర్మబీజాలు చాలా ఉంటాయి. ఎన్ని జన్మలుంటాయో మనకేం తెల్సు.. జన్మలో దుఃఖం, జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకి తెల్సు కాని అది పొందడానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో ఈశ్వరుడికే తెలియాలి. జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగుచేసుకొన్న కర్మబీజాలు పోవాలి. అవి అలా వదిలేసినా మళ్లీ మొలకెత్తుతాయి. మామూలు మొలకలు కాదు క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారౌతాయి. కాబట్టి ఈ కర్మబీజాలని 'శి' 'వ' అనే తిరగలి రాళ్ళలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్లీ జన్మ అనేదే ఉండదని ఆది శంకరుల వారు అభయమిచ్చారు. శివ నామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది... అరుణాచల శివ..🙇‍♂️🙏🪷 #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #ఓం శివోహం... సర్వం శివమయం #🙏ఓం నమః శివాయ🙏ૐ #om Arunachala siva🙏
చిదానంద రూప శివోహం శివోహం - ShareChat