🌼🚩 అయ్యప్ప స్వామి 🚩🌼
🔥 మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు.
శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు
🔥 అయ్యప్ప జననము
క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
🔥 భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ... తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు వరము పొంది ... తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను . శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి భస్మాసుర వధ గావించెను .
🔥 వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి .
.
#☀️శుభ మధ్యాహ్నం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🥁స్వామియే శరణం అయ్యప్ప #🙏శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి🕉️

