ShareChat
click to see wallet page
search
పాలకుల (రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల) వల్లనే *రైతులు అభివ్రుద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉంటున్నారు*. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులకు (నాయకులకు) నివాసానికి క్వార్టర్లు (బిల్డింగ్లు), క్యాంప్ ఆఫీసులు, లగ్జరీకార్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు హెలీకాప్టర్లలో ప్రయాణం, పెన్షన్లు, ఎకరాలకొద్దీ భూములు, కోట్ల సంపాదన, పదవి,హోదా,ఆస్థి,అంతస్తులు,సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. ఓట్లు వేసినటువంటి ప్రజలకు (ఓటర్లకు) చాలామందికి స్వంత ఇండ్లు లేవు. అప్పులున్నాయి.అభివ్రుద్ధి చెందడంలేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం. జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు,రైతు కుటుంబాలు,రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడంలేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. రాజకీయ నాయకులు మాత్రం అభివ్రుద్ధి చెందుతున్నారు. *రైతులు అభివ్రుద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు* :: 1. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేకపోవడం. ఉన్నటువంటి కొద్దిపాటిమార్కెట్లు వ్యాపారులకు కేటాయించడం వలన. 2. రైతుల కష్టం మొత్తం దళారుల, వ్యాపారుల పాలు అవుతున్నది. కష్టం రైతులది. లాభాలు మాత్రం దళారులకు,వ్యాపారులకు. 3. రైతులు తాము పండించిన పంటల ధరల్ని తామే నిర్ణయించుకునే పరిస్థితి లేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు, మరికొన్ని పంటలకు అడ్తిలో వ్యాపారులు నిర్ణయిస్తున్నారు. పై కారణాల వలన 1. ఒక ఎకరంలో *మిర్చి* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 2. ఒక ఎకరంలో *తమాట* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 3. ఒక ఎకరంలో *సోరకాయ* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 2-3 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 4. ఒకప్పుడు *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి రూ// 10,000 ఉన్నప్పుడు, వడ్ల ధర క్వింటాలుకు సుమారు రూ// 1,000 ఉండేది! ప్రస్తుతం *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి లక్షల్లో (2-4 లక్షలు) ఉంది. క్వింటాలు వడ్ల ధర మాత్రం రూ// 3,000 దాటలేదు. 5. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడి సెంటర్స్ మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీపాయింట్స్,క్యాటెరింగ్ మొ//వాటన్నింటికి నేరుగా రైతుల వద్ద నుండే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా అయినప్పుడే రైతులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారుల నుండి సరఫరా అయినన్ని రోజులు రైతులు అభివ్రుద్ధి చెందరు. రైతులకు మంచి లాభాలు రావు. 6. రైతుభరోసా (గతంలో రైతు బంధు) ఎకరానికి సంవత్సరానికి మొదట 8 వేలు ఇచ్చారు. ప్రస్తుతం 12,000 వేలు ఇస్తున్నారు. ఈ పథకంతో పాటు రైతుభీమా మరియు రాయితీలు లాంటివి రైతులకు ఇస్తున్నప్పటికి రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందదం లేదు. దళారీ వ్యవస్థ నిర్మూలన (నాశనం) అయినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. రైతులు *రాజు* అవుతారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. మార్కెట్లు అనేవి రైతుల కోసం నిర్మించాలి. కానీ, మన పాలకులు (నాయకులు) మాత్రం వ్యాపారులకు కేటాయిస్తారు. ----- *రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే*, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. ఓట్లు అయితే ఎలాగూ వేస్తాము. ఆ వేసే ఓటు మన రైతులకు వేద్దాం. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. 70% మంది రైతులు,రైతుకుటుంబాలు,రైతు కూలీల నుండి, 30% మంది విద్యార్థులు, యువత నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెడతాను. గమనిక : రైతులు అంటే చిన్న,సన్నకారు రైతులు. (అడ్డగోలుగా భూములు ఉన్న రైతులు కాదు) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #agriculture #vyavasayam #rythu samacharam #@jai telangana....💕 #telanga news (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043
agriculture - పాలకుల (రాజకీయ ವೌಕ್ವಿಲನೌಯತುಲ) నిర్ణయాల వలన రైతులు అభివృద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉన్నారు: డిస్ర్తిప్షన్లో  ಪೌಕ್ತಿ ವಿಏಕಣ ಡಂದಿ జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: పాలకుల (రాజకీయ ವೌಕ್ವಿಲನೌಯತುಲ) నిర్ణయాల వలన రైతులు అభివృద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉన్నారు: డిస్ర్తిప్షన్లో  ಪೌಕ್ತಿ ವಿಏಕಣ ಡಂದಿ జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: - ShareChat