అమ్మవారి సౌందర్యం ఇలా ఉంటుంది అని వర్ణించడం కష్టమేనుట బ్రహ్మాదులకు కూడా..!
" ఆశోభనా " అమ్మవారి అద్భుత నామం.
" ఆశోభనా " అంటే అంతటా సౌందర్యము కలది. అమ్మవారి సౌందర్యం ఎంత అద్భుతం అంటే మన్మధుడిని కాల్చిపడేసిన శివుడిని మోహంలో పడేసేటంత అన్నారు మూకశంకరులు.
దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని కీర్తిస్తాం. శ్రీలలితాపంచరత్న స్తోత్రంలో శంకరాచార్యులు " ఆకర్ణదీర్ఘనయినీం " అని ప్రార్థిస్తారు. కళ్ళు చెవులదాకా సాగి ఉన్నాయి అని..
శంకరాచార్య విరచిత సౌందర్యలహరిలో " సౌందర్యలహరి " అనే పదం చాలాసార్లు వస్తుంది. లహరి అంటే అల, సౌందర్యలహరి అంటే " సొగసువెల్లువ " అని తెలుస్తూంది..
అమ్మవారి సౌందర్యం అంత అద్భుతంగా
ఉంటుంది.. ఎంతగా అంటే ఓ శ్లోకం చూద్దాం..
శరజ్జ్యోత్స్నా శుద్ధాం
శశియుతజటాజూటమకుటాం,
వరత్రాసత్రాణ స్ఫటికఘటికా
పుస్తకకరాం, సకృన్నత్వా న త్వాం
కధమివసతాం సన్నిదధతే,
మధుక్షీర ద్రాక్ష
మధురిమ ధురీణాః ఫణితయః "...
" శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరముకలిగి వర అభయ ముద్రలు స్ఫటికమాల పుస్తకములతో కూడిన చేతులు ( 4 చేతుల అలంకారాలు ) కలిగిన నిన్ను ( నీరూపాన్ని ) ఒక్కసారైనా ధ్యానించుకోకపోతే సజ్జనులకైనా ( నోటివెంట ) తేనె పాలు ద్రాక్షల వలె మధురముగా ఉన్న మాటలెలా ( కవిత్వం ) వస్తాయమ్మా " అని...
దేవతలు ఏవో కోరికలతో వెడతారుట అమ్మవారి సన్నిధికి. అమ్మవారు చిరునవ్వుతో ఏపనిమీద వచ్చారు అని అడిగితే " ఏమీ లేదమ్మా, మీ దర్శనం కోసం వచ్చాం " అంటారుట. అమ్మవారి చిరునవ్వు చూడగానే ముగ్ధులయిపోయి వచ్చిన పని మరిచిపోతారని భావం. అంత అద్భుతం అమ్మవారి చిరునవ్వు...!!
#🕉Sri Mathre Namaha 🕉 #🕉 Sri Mathre Namaha 🕉 #Om sri mathre namaha #om sri mathre namaha🙏🙏 #sri mathre namaha


