ShareChat
click to see wallet page
search
తిథులలో సప్తమి తిథికి #సూర్యనారాయణమూర్తి అధిపతి. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు “రిఫ” అనే దోషము కూడా ఆపాదింపబడుతుంది. సప్తమి తిథి పూర్తికావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పితృభావ కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటిరోజు మాఘశుద్ధసప్తమి. దీనికే “సూర్యసప్తమి” అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? సూర్యనారాయణమూర్తి రథం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. అసలు, ఒకే చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే ఒక చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా, క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటివాడు సూర్యనారాయణుడు. కనుక, ఆ సప్తమే “రథసప్తమి, సూర్యసప్తమి”. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిరఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికానక్షత్రే కళింగ దేశాధిపతిం" అంటూ సూర్యనారాయణమూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు. ఆ స్వామి కృత్తికానక్షత్రంలో జన్మించారని, సాంప్రదాయ గ్రంథాలన్నీ వర్ణిస్తాయి. దక్షిణాయనం పూర్తీ అయిపోయి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మటవచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతికిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథినాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్యరథం ముగ్గు వేయడం, అలాగే సూర్యనారాయణమూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్యత కలిగినరోజు రథసప్తమి. సూర్యనారాయణమూర్తిని ఆరాధనచేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః #☸🙏సూర్యనారాయణ స్వామి #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #రధ సప్తమి
ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః - Suryanarayana Swamy Suryanarayana Swamy - ShareChat