#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party పాలమూరు విలన్ కాంగ్రెస్సే.. కృష్ణా జలాల విషయంలో బాబు చెప్పినట్టే రేవంత్ ఆడుతున్నడు: కేటీఆర్ పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని, ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి పథకానికి కేసీఆర్ హయాంలో కేటాయించిన 90 టీఎంసీల నీటి కేటాయింపులు కాదని, 45 టీఎంసీలే చాలం టూ ఇక్కడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నదని నిప్పులు చెరిగారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందనే సాగునీటి ప్రాజెక్టులను రేవంత్‌రెడ్డి పండబెట్టిండు
కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ప్రోగ్రెస్ నిల్
రైతుబంధు పాలన పోయి తెలంగాణ రాష్ట్రంలో రాబందుల పాలన వచ్చింది
యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి తెచ్చిండ్రు
రేవంత్ ధ్యాసంతా భూదందాలపైనే తప్ప గ్యారెంటీల అమలుపై లేదు
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే యూరియా ఇస్తానని.. హామీలు అమలు చేస్తానని శపథం చెయ్: కేటీఆర్ సవాల్
నాగర్‌కర్నూల్‌లో సర్పంచ్‌లకు సన్మానం
రేవంత్‌రెడ్డీ.. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి బరాబర్ శపథం చెయ్.. ఒక్క రైతుకు కూడా యూరియా కష్టం లేకుండా చేస్తానని శపథం చెయ్.. దమ్ముంటే.. మహిళలందరికీ నెలకు రూ.2,500 కొత్త సంవత్సర కానుకగా ఇస్తానని శపథం చెయ్.. సంక్రాంతి నుంచి తులం బంగారం ఇస్తానని శపథం చెయ్.. ముసలోళ్లకు రూ.4వేల పెన్షన్ ఇస్తానని శపథం చెయ్..
పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని, ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి పథకానికి కేసీఆర్ హయాంలో కేటాయించిన 90 టీఎంసీల నీటి కేటాయింపులు కాదని, 45 టీఎంసీలే చాలం టూ ఇక్కడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సభలో కేటీఆర్ మాట్లాడారు.


