S.HariBlr (Bangalore)
1K views • 1 months ago
#😇My Status #శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు *శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, గరుడ వాహన సేవ...🦅* *తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం గరుడ వాహన సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనం అనుగ్రహించనున్నారు.* *గరుడుని విశిష్టత...🦅* *వైష్ణవ సంప్రదాయంలో గరుడాళ్వారు శ్రీమహావిష్ణువారి వాహనం మాత్రమే కాకుండా, పరమభక్తుడు, నిత్యసేవకుడుగా విశిష్టమైన స్థానం పొందారు. భగవంతుని పట్ల సంపూర్ణ శరణాగతి, దాస్యభక్తి, నిస్వార్థ సేవకు గరుడుడు ప్రతీకగా భావించబడతాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభంలో గరుడ ధ్వజాన్ని ఎగురవేసే సంప్రదాయం కూడా గరుడుని విశిష్టతను తెలియజేస్తుంది. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించడం భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతి. స్వామి వారి దివ్యదర్శనం చేసుకుంటూ గోవింద నామస్మరణతో మనసును భగవంతుని పాదపద్మాలపై నిలపడం ఈ పవిత్ర వాహన సేవలోని ఆధ్యాత్మిక సందేశం.🙏*
8 shares