ShareChat
click to see wallet page
search
క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..? ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది. 2. MU - మార్కప్ (Mark-Up) ఈ బటన్ ని ఖర్చు, లాభం, డిస్కౌంట్ లను ఖచ్చితంగా, ఈజీ గా లెక్కగట్టేందుకు వాడుతారు. ఉదాహరణకి, మీరు ఒక వస్తువును 400 రూపాయలకు కి కొనుగోలు చేశారు అనుకోండి, దానిపై 100 రూపాయల మీకు రావాలి ఎట్ ది సేమ్ టైం కస్టమర్‌కు 20% డిస్కౌంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మీకు ఎంత ధరకు వస్తువు అమ్మితే కస్టమర్ కు 20 % డిస్కౌంట్ పోనూ, మీకు వంద రూపాయల లాభం వస్తుందో లెక్కగట్టటానికి ఇది చాలా ఉపయోగం. సో ఇప్పుడు MU బటన్ ఎలా వాడాలో చూద్దాం. ఇక్కడ మీరు కొన్న ధర 400 రూపాయలు, దీనిపై మీకు కావాల్సిన లాభం 100 రూపాయలు. అంటే మొత్తం రూ.500 అయింది. కస్టమర్ కు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు కాలిక్యులేటర్ లో మీరు కొన్న ధర ప్లస్ లాభం కలిపి 500 కాబట్టి ఆ నెంబర్ ను ప్రెస్ చెయ్యండి. తరువాత MU బటన్ ను నొక్కి 20 % అని ప్రెస్ చేస్తే మీకు 625 చూపిస్తుంది. అంటే మీరు కస్టమర్ కు చెప్పాల్సిన ధర 625 రూపాయలు. సో సింపుల్ కదా. ఇన్నాళ్లు మీరు ఈ బటన్ వాడనట్టయితే ఇక నుండి వాడి చూడండి. కస్టమర్ కు డిస్కౌంట్ లు వారి ముందే లెక్కగట్టినా వారికి ఒక్క ముక్క అర్థం కాదు. మీకు లెక్క కూడా ఈజీ అయిపోతుంది. M+, M- మరియు MRC అంటే ఏమిటి? ఈ రెండు బటన్లను ప్లస్ (+ ) మరియు మైనస్ (- ) లెక్కలలో రిజల్ట్ పొందేందుకు వాడతారు. M+ అంటే మెమరీ ప్లస్, అలాగే M- అంటే మెమరీ మైనస్ ఇక MRC అంటే మెమరీ రీకాల్. ఇవి ఎందుకు వాడతారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు 10 ×3 అనే గుణకారం ( Multiply ) నుండి 2 ×3 అనే గుణకారాన్ని ( Multiply ) మైనస్ చెయ్యాలనుకుంటే ఈ బటన్లను ఎలా వాడాలో చూద్దాం. ముందుగా 10 ×3 = 30 ను కాలిక్యులేట్ చేసి M + బటన్ను ఒత్తండి. అంటే ఇప్పుడు ఆ 30 మెమరీ చేయబడినది అర్థం. ఇప్పుడు దాంట్లోనుండి మైనస్ చెయ్యవలిసిన 2 ×3 అనే గుణకారం ను ప్రెస్ చెయ్యండి వచ్చే ఆన్సర్ 6 . ఇప్పుడు మీకు మైనస్ ఆన్సర్ కోసం M - ను ప్రెస్ చెయ్యండి. ఇక మొత్తం ఫైనల్ ఆన్సర్ కోసం MRC అంటే బటన్ ను ఒత్తినట్టయితే మీకు ఆన్సర్ 24 వస్తుంది. సో మీకు పెద్ద పెద్ద లెక్కలో చేసేప్పుడు పెన్ తో పేపర్ పై నోట్ చేసుకోవాలిసిన అవసరాన్ని తప్పిస్తుంది. బాగుంది కదా. అబ్బా ఇంతుందా వీటిలో అని ఆశ్చర్యపోతున్నారా. ఇవీ మనం రెగ్యులర్ గా వాడే ఫిజికల్ కాలిక్యులేటర్ లో మనకు తెలియని విషయాలు. మనం నిత్యం వాడే వస్తువు లోనే మనకు ఇన్ని తెలియని విషయాలుంటే ఇక మన చుట్టూ ఇంకెన్ని తెలియని విషయాలుంటాయో ఆలోచించండి . అందుకే సమయాన్ని వృధా చెయ్యకుండా అర్జెంటుగా నాలెడ్జి పెంచుకోండి. అదేదో సినిమాలో మన బ్రహ్మి చెప్పినట్టు నాలెడ్జి ఈజ్ డివైన్ మరి...ఎంత తాగితే... సారీ ..ఎంత తెలుసుకుంటే అంత లాభం... #తెలుసుకుందాం #calculator #😴మనకు తెలియని నిజాలు #unknown facts #unknown facts
తెలుసుకుందాం - MEMORY HS GT ERROR MU + ORPAT ١٥٦٦٥٥ ٦٥٥٥ IL[ * 01-512G1 CRT ಕ REP % CHECA & CORRECT CALCULATOR . 3 YEAR BAT TERY LIFE LARGE DISPLAY பபL REPDY CHauk కచిపానిచ  REAL SOLAR CELL 120 HECK 8 9 O   GT M٤ 6 MU M= 3 2 CE Mt MEMORY HS GT ERROR MU + ORPAT ١٥٦٦٥٥ ٦٥٥٥ IL[ * 01-512G1 CRT ಕ REP % CHECA & CORRECT CALCULATOR . 3 YEAR BAT TERY LIFE LARGE DISPLAY பபL REPDY CHauk కచిపానిచ  REAL SOLAR CELL 120 HECK 8 9 O   GT M٤ 6 MU M= 3 2 CE Mt - ShareChat