ShareChat
click to see wallet page
search
_*నాగులచవితి(25.10.25)*_ 🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑 కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామి కి కూడా విశేషమైనది గా చెప్పుకో వచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలివిడి, చిమ్మిరి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నాల్లో ఆవుపాలు పోసి, చలివిడి, చిమ్మిరి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించు కుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ] లేని వారు, ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమ్మిరి తో నాగేంద్రుడు, చలివిడి తో నాగేంద్రుడు ని పెట్టుకుని, లేదా నాగ పడగ ను వెండి, బంగారం తో ఒక ప్లేట్ లో పెట్టుకొని,పూజ చేసుకుని, పాలు పోసి, చలివిడి, చిమ్మిరి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడి ని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే, వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితినాడు నాగేంద్రుని శివ భావము తో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్య వంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ! *పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!* *సత్సంతాన సంపత్తిం!* *దేహిమే శంకర ప్రియా!* *అనంతాది మహానాగరూపాయ వరదాయచ!* *తుభ్యం నమామి భుజగేంద్ర!* *సౌభాగ్యం దేహిమే సదా!* *శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!* నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి! ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీ శక్తి మూలాధారచక్రం లో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్ప పుట్టలను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే మానవుని లో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలున్న వారు, ఈ కార్తీకమాసం లో వచ్చే షష్టీ, చతుర్దశి లలో మంగళవారము నాడు గాని, చతుర్దశి బుధవారం కలసి వచ్చే రోజు కాని, దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా, పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం, తైత్తిరీయ సంహిత నాగపూజా విధానాన్ని వివరించింది. వేపచెట్టు లేదా రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇడా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8 వంకరల సర్పవిగ్రహం సుషుమ్నా నాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాముల పుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలుపోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేశుడు గా, అనంతమనే శేషశాయి గా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లో కూడా సర్పం ఉంటుంది. మరోవిధం గా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #🌅శుభోదయం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏నేడే నాగుల చవితి🐍 #🐍నాగులచవితి🐍శుభాకాంక్షలు🙏
🌅శుభోదయం - NAGULA CHAVITHI NAGULA CHAVITHI - ShareChat