💐శ్రీ4లింగ మహాపురాణం💐
🌼సృష్టి - కల్పాలు,యుగాలు దేవపితృమానవసంవత్సరాలు -కాల గణన.🌼
#నాలుగవ భాగం#
బ్రహ్మ ప్రాకృతిక సృష్టి చేసే సమయాన్ని బ్రహ్మకు పగటి కాలంగా, సృష్టి లయం చేసి నిదురించే సమయాన్ని రాత్రి కాలంగా పిలుస్తారు. బ్రహ్మ దేవుని పగలు రాత్రి సమయం సమానంగాఉంటుంది.బ్రహ్మదేవుడు పగలు సృష్టించిన ప్రపంచాన్ని రాత్రి అవాంతర ప్రళయం ద్వారా లయం చేసి నాశనం చేస్తాడు.
బ్రహ్మదేవుని పగటి కాలంలో దేవతలు,ప్రజాపతులుమహ ర్షులుఆవిర్భవించిఉంటారు.
బ్రహ్మ రాత్రి కాలంలో వారు నశించి సూక్ష్మ రూపులై ఉండి రాత్రి సమాప్తం కాగానే తిరిగి జన్మిస్తారు. బ్రహ్మపగటికాలాన్ని కల్పము అంటారు. రాత్రి కూడా ఒక కల్ప సమయం కలిగి ఉంటుంది.
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాలు కలిపితే ఒక మహయుగం అవుతుంది. ఇటువంటి వేయి మహా యుగాలు ఒక కల్పము అవుతుంది. పద్నాలుగు మంది మనువులుఈవేయిమహాయుగాలలోపాలకులుగాఉంటారు
కృతయుగం 4800 దివ్య సంవత్సరాలు (1728000 మానవ సంవత్సరాలు
త్రేతాయుగం 3600 దివ్య సంవత్సరాలు (1296000 మానవ సంవత్సరాలు)
ద్వాపరయుగం 2400 దివ్య సంవత్సరాలు (864000 మానవ సంవత్సరాలు)
కలియుగం 1200 దివ్య సంవత్సరాలు (432000 మానవ సంవత్సరాలు)
ఈ నాలుగు యుగాలు యుగ సంధ్యలు, యుగ సంధ్యాంశలు కలిపి ఒక మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు (43, 32, 000 మానవ సంవత్సరాలు) అవుతుంది.
ఆరోగ్యంగా సామాన్య స్థితిలో మానవుడు పదహేను సార్లు (నిమేషములు) కనురెప్పలు వాల్చే సమయాన్ని ఒక "కాష్టము" అంటారు. ముప్పై కాష్టముల కాలాన్ని ఒక "కళ" అంటారు. ముప్పై కళల కాలా న్నిఒకముహుర్తముఅంటారు.
పదిహేనుముహుర్తము లు ఒక పగలు,పదిహేనుముహుర్తములు ఒక రాత్రి అవుతుంది. మానవునికి పగలు రాత్రి కలిపి ఒక రోజు అవుతుంది.పదిహేను రోజులు ఒక పక్షం అవుతుంది.
చంద్రుడు వృద్ధి చెందే పూర్ణ రూపం పొందే పక్షం శుక్ల పక్షం, చంద్రుడు క్షీణిస్తూ అస్తమించే పక్షం కృష్ణ పక్షం అవుతుంది. శుక్ల పక్షం, కృష్ణ పక్షం కలిపి ఒక మాసము, రెండు మాసాలు ఒక ఋతువు, ఆరు ఋతువులు ఒక ఆయనం,రెండుఆయనాలు (ఉత్తరాయనం, దక్షిణాయనం) ఒక సంవత్సరం అవుతుంది. మానవ సంవత్సరంలో రెండు ఆయనాలు, ఆరు ఋతువులు, పన్నెండు మాసాలు, 360 రోజులు ఉంటాయి.
పితృదేవతలకు మానవుల నెల రోజులు ఒక రోజు అవుతుంది. శుక్ల పక్షం పగలు గాను, కృష్ణ పక్షం రాత్రి గాను ఉంటుంది. మానవుల 360నెలలుపితృదేవ తలకుఒకసంవత్సరంఔతుంది. మానవుల వంద సంవత్సరాలు పితృదేవతలకుమూడుసంవత్సరాలుఔతాయి.
మానవుల ఒక సంవత్సర కాలం దేవతల కాలమానం ప్రకారం ఒక రోజు అవుతుంది. మానవుల ఉత్తరాయణం పగలు గాను, దక్షిణాయనం రాత్రిగానుదేవతలకుఅవుతుంది. ముఫై మానవసంవత్సరాలు దేవతలకు ఒక దివ్య మాసం అవుతుంది. 360 మానవ సంవత్సరాలు దేవతలకు ఒక దివ్య సంవత్సరం అవుతుంది.
మానవుల 3030 (మూడు వేల ముప్పై) సంవత్సరాలు సప్తర్షులకు ఒక సంవత్సరం అవుతుంది. మానవుల 9090 సంవత్సరాలు ఒక ధ్రువ సంవత్సరం అవుతుంది. 36000 మానవ సంవత్సరాలు ఒక దేవ లేక దివ్య వత్సరం (శతాబ్ది) అవుతుంది. మూడు వందల అరవై వేల మానవ సంవత్సరాలు వేయి దివ్య వర్షములు అవుతాయి.
సృష్టిఆరంభంలోఇరవైఎనిమిది కోట్ల దేవతలు ఊర్ధ్వలోకాలలో ఉంటూ వాయురథాలలో (విమానాలలో)ప్రయాణిస్తుంటారు.మన్వంతరాలలో వీరిసంఖ్య పెరిగి 392 కోట్లుగా ఉంటుంది. సృష్టిఉపసంహారములోవీరిసంఖ్య తగ్గి డెబ్భై ఎనిమిదివేలు అవుతుంది.ప్రళయసమయంలో వీరు మహర్లోకము నుంచి జనలోకం వెళ్లి పోతారు.
తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓంశ్రీ ఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీ శివార్పణమస్తు)
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5?mode=ems_copy_t #🙏ఓం నమః శివాయ🙏ૐ 🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


