ShareChat
click to see wallet page
search
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #kcr కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానల్ ఓనర్ కు సంతాపం !! జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్, ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత కే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు. తద్వారా.. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ, జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు, హరీశ్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి లతో అధినేత చర్చించారు. కాగా.. అధినేతతో చర్చలో పాల్గొనాల్సిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తలసాని శ్రీనివాస్ యాదవ్., వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కాలేక పోవడం వలన వారితో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat