తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ ను సాధించిన టీం ఇండియాకు జేజేలు!
లేదా
అనేక ఏళ్లుగా అందని ద్రాక్షగా వున్న వన్డే ప్రపంచకప్ సాదించడం అనే చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు సాకారం చేసుకున్న హార్మన్ ప్రీత్ కౌర్ సేన!
గతంలో 2005,2017 లలో సైతం మన భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించినప్పటికి ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ జట్ల చేతిలో అన్యూహంగా పరాజయాలను మూటగట్టుకున్న మన టీం ఇండియా ఎట్టకేలకు తన మూడో ప్రయత్నంలో హార్మన్ ప్రీత్ సేన సమిష్టిగా రాణించి 2025 వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడం ఎంతైనా హర్షణీయమైన విషయం.పైగా ఈ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అత్యంత పటిష్టమైన సౌతాఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో హార్మన్ ప్రీత్ కౌర్ సేన ఓడించి వన్డే వరల్డ్ కప్ ను హస్తగతం చేసుకోవడాన్ని కనులారా వీక్షించిన కోట్లాదిమంది భారత మహిళల క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు యావత్ భారత జాతి ఈ భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన ఈ అఖండ విజయాన్ని చూసి ఎంతో గర్విస్తున్నది అనే మాట సత్యదూరం కాదు.ఇక ఈ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హార్మన్ ప్రీత్ కౌర్ సేన 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.ముఖ్యంగా ఓపెనర్ షఫాలీ వర్మ ( 78 బంతుల్లో 87,7 ఫోర్లు,2 సిక్స్ లు ), దీప్తి శర్మ ( 56 బంతుల్లో 58,3 ఫోర్లు,1 సిక్స్ )అర్ధ సెంచరీలు సాధించడం,సృతి మంధానా ( 58 బంతుల్లో 45,8 ఫోర్లు ) సైతం విలువైన పరుగులు సాధించడంతో మన భారత మహిళల క్రికెట్ జట్టు 298 పరుగుల ఛాలెంజింగ్ స్కోరును దక్షిణాఫ్రికా జట్టు ముందు ఉంచగలిగింది.ఇక ఆ తర్వాత 298 పరుగుల అత్యంత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు మన భారత మహిళల క్రికెట్ జట్టు బౌలర్ల దాటికి 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులు మాత్రమే సాధించి 52 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అదేమాదిరి బ్యాటింగ్ లో విశేషంగా రాణించిన షఫాలీ వర్మ,దీప్తి శర్మలు బౌలింగ్ లో సైతం తమ వాడి,వేడిని ప్రదర్శించి ఇరువురు కలిసి 7 గురు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మ్యాన్ లను అవుట్ చేయడంతో ఇక భారత మహిళల క్రికెట్ జట్టు విజయం నల్లేరు మీద నడకే అయ్యింది.అంతేకాదు బ్యాటింగ్ లో 87 పరుగులు,బౌలింగ్ లో 2 వికెట్లు సాధించిన షఫాలీ వర్మ కు ' ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ పురస్కారం,అలాగే బ్యాటింగ్ లో 58 పరుగులు,బౌలింగ్ లో 5 వికెట్లు సాధించిన దీప్తి శర్మకు ' ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ' అవార్డు వరించడం ఎంతైనా అభినందనీయం.అన్నింటికి మించి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల నల్లపురెడ్డి శ్రీ చరణి తన పదునైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ తో ఈ వన్డే విశ్వకప్ టోర్నీలో 9 మ్యాచ్ లలో 27.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టి మరీ భారత మహిళల జట్టు తరపున రెండో అత్యుత్తమ బౌలర్ గా నిలవడమే కాదు ఈ భారత మహిళ క్రికెట్ జట్టు సాధించిన వన్డే విశ్వకప్ లో తన వంతు పాత్రను సైతం అమోఘంగా పోషించడం మన ఆంధ్రప్రదేశ్ వాసులందరికి కూడా ఎంతో గర్వకారణం అనే మాట అక్షర సత్యం.
ఏదిఏమైన ఇంతకాలం అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఈ మహిళల వన్డే ప్రపంచకప్ ను ఎట్టకేలకు హార్మన్ ప్రీత్ కౌర్ సేన సమిష్టి కృషితో,ఓ మంచి టీం స్పిరిట్ తో ఇటు బ్యాటింగ్,అటు బౌలింగ్,ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాలలో కూడా అత్యద్భుత ప్రతిభ కనబరచి ఓ చిరస్మరణీయమైన,వెలకట్టలేని విజయానికి నాంది పలుకడంతో యావత్ భారతదేశ అశేష,కోట్లాది మంది క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి అనే మాట అక్షర సత్యం.అన్నింటికి మించి ముంబైకి చెందిన ఓకప్పటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ 51 ఏళ్ల మజూందార్ మన భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ గా తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించడమే కాదు,జట్టును అభేధ్యమైన,ఓ మంచి ప్రతిభావంతమైన జట్టుగా తీర్చిదిద్దడంలో నూటికి నూరుపాళ్ళు సపలీకృత్యులు అయ్యారు కాబట్టే ఈ అపురూప విజయంతో ఆయన పాత్ర కూడా ఏ మాత్రం తీసివేయలేనిది కూడా.ఏమైనా ఈ అసాధారణ విజయం తర్వాత భారత మహిళల క్రికెట్ టీం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమే అని,మున్ముందు ఇలాంటి అద్భుత,అమోఘమైన విజయాలను మేమంతా ఓ అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నామని,రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలలో ఆడవలసి ఉందని,వాటిల్లో సైతం ఇదే దూకుడును,జోరును తమ జట్టు కొనసాగిస్తుందని ఆమె గారు చెప్పడాన్ని బట్టి ఈ అసాధారణ విజయం మన భారత మహిళల క్రికెట్ జట్టులో ఎంతటి జోష్ ను,ఆత్మవిశ్వాసాన్ని నింపిందో మనం ఇట్టే ఊహించవచ్చు.జయ జయహో భారత మహిళల క్రికెట్ జట్టు! హ్యాట్సాఫ్ టూ హార్మన్ ప్రీత్ కౌర్ సేన! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🏏🏏🏏🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #women cricket


