ShareChat
click to see wallet page
search
శరీరం నందు వాత, పిత్త , కఫాలు పెరిగినపుడు ఏర్పడే శారీరక , మానసిక మార్పులు - # శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు - ☆ శారీరక మార్పులు - * బరువు తగ్గుట. * శరీర దారుఢ్యం , బలం తగ్గును. * నరాల నొప్పులు పెరుగును . * కండరాల నొప్పులు పెరుగును . * నడుములో నొప్పి ముఖ్యముగా నడుము క్రింద . * కీళ్లనొప్పులు , కాళ్ల నొప్పులు పెరుగును . * చర్మం గరుకుదనం పెరుగును . * పెదాలు , శరీరం పగుళ్లు ఏర్పడును . * మలబద్దకం . * కడుపుబ్బరం , గ్యాస్ పెరగటం , గ్రహణి సమస్య * అధిక రక్తపోటు . * చలిగాలికి తట్టుకోలేకపోవడం . * ఋతువునోప్పి . ☆ మానసిక మార్పులు - * మనసు కుదురుగా ఉండదు. రకరకాలుగా పరుగుతీయును . * పూర్తి విశ్రాంతి తీసుకోలేకపోవడం . * దేనిమీద ఏకాగ్రత ఉండదు. * అధికమైన ఆందోళన . * గాభరా ఎక్కువ అవ్వడం . * అసహనంగా ఉండటం . * దిగులు , నిద్రపట్టక పోవడం . * త్వరగా అలసిపోవడం . * ఆకలి లేకపోవటం . # శరీరం నందు పిత్తం ప్రకోపం చెందినపుడు - ☆ శారీరక మార్పులు - * అతిగా దాహం వేయడం . * అతిగా ఆకలి వేయడం . * హైపర్ ఎసిడిటి , అల్సర్ ఏర్పడుట. * ఎండని తట్టుకోలేకపోవడం . * వొళ్ళంతా మంటలు . * చర్మం పైన పుళ్ళు ఏర్పడుట . * దద్దురులు , కురుపులు , మొటిమలు వచ్చును . * దుర్వాసన , చమటలు అధికంగా పట్టడం . * మొలల వ్యాధి , మలద్వారం వద్ద మంట. * కళ్లు ఎరుపెక్కడం . * మూత్రం మంటగా , బాగా పలచగా , ఎరుపుగా వెళ్లడం . ☆ మానసిక మార్పులు - * ప్రతిదానికి అరవడం , కేకలు పెట్టడం , చికాకు పడటం . * కోపం అధికం అవ్వడం . అసహనం పెరుగుట . * ప్రతిదాన్ని విమర్శించడం . * ప్రతిదానికి ఎదురుమాట్లాడటం . * ప్రతివాళ్ల మీద పగతీర్చుకుంటా అనడం , ప్రవర్తించటం . # శరీరము నందు కఫం ప్రకోపం చెందినపుడు - ☆ శారీరక మార్పులు - * ఛాతి బరువుగా ఉండటం. * కంఠం కఫముతో పూడుకొనిపోయినట్టు ఉండటం. * ముక్కు , సైనస్ లు జిగురుతో నిండిపోవడం . * దగ్గు , ముక్కు కారటం , తరచూ జలుబు చేయడం . * చలి , తేమని తట్టుకోలేకపొవడం . * ఎప్పుడూ ఎలర్జీలతో ఇబ్బందిపడటం * ఉబ్బసం కలగడం . * అధిక బరువు పెరగటం . * కొలెస్ట్రాల్ మోతాదు పెరగటం . * శరీరం నందు వాపులు పెరగటం . * కడుపుబ్బరం . * శరీరం చల్లగా , తెల్లగా మారడం . * మధుమేహ సమస్య రావటం . * శరీరంలో గడ్డలు , కండలు పెరగటం . పైన చెప్పిన లక్షణాలన్నీ చూస్తే మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అనగా శరీరం నందలి వాత, పిత్త , కఫాలు కొన్ని కొన్ని కారణాల వలన హెచ్చుతగ్గులకు లోనగును. అలాంటప్పుడు ఏదైతే పెరిగిందో అలా పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి . ఉదాహరణకు పైన చెప్పిన లక్షణాలు ఆయా శరీర ప్రకృతుల వారికి సహజ లక్షణాలు . అంటే వాత ప్రకృతి గల వారికి ఏ మాత్రం వాతం పెరిగినా నొప్పులు వెంటనే వస్తాయి. అలాగే కఫం పెరిగితే వాళ్లకి నొప్పులు రావా ? అంటే వస్తాయి . కఫ శరీర తత్త్వం గలవారికి నొప్పులు వచ్చాయంటే వారితో వాతం పెరిగిందని అని అర్థం . అలాగే బరువు అధికంగా పెరగటం కఫ శరీర తత్త్వం ఉన్నవారి లక్షణమైన వాత, పిత్త శరీరతత్వం ఉన్నవాళ్లు కూడా బరువుపెరుగుతారు అటువంటప్పుడు వారిలో కఫ సంబంధ దోషం పెరిగిందని అర్థం చేసుకోవాలి . వాతశరీరం కలిగిన వారు బరువు త్వరగా తగ్గుతారు , బరువు ఆలస్యముగా పెరుగుతారు. పిత్త శరీరం కలవారు ఆకలి ఎక్కువుగా ఉండటం , స్ట్రెస్ ఎక్కువుగా ఉండటం వలన అతిగా తింటారు. దానివల్ల బరువు పెరుగుతారు . వీరుకొంత ఆలస్యముగా బరువు తగ్గుతారు. కఫప్రకృతి వారు బరువు తగ్గడం అంత త్వరగా సంభవించదు. #తెలుసుకుందాం #😴మనకు తెలియని నిజాలు #🍃ఆయుర్వేదం #🍃ఆయుర్వేదం
తెలుసుకుందాం - KAPHA PITTA VATTA 106 YOGA YOGA KAPHA PITTA VATTA 106 YOGA YOGA - ShareChat