గోడకు కొట్టిన మేకులు…..అద్బుతమైన ఓ జీవిత సత్యం
******************************************
ఓ కొడుక్కి…తండ్రి కొన్ని మేకులు ఇచ్చి….నీకు రోజుకి ఎంత మంది మీద అయితే కోపమొస్తుందో
అన్ని మేకులు గోడకు కొట్టు అని అన్నాడు.!
మొదటి రోజు 20, తర్వాతి రోజు 15,
మూడవ రోజు 10 ఇలా… తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు కొడుకు.
మేకులు అయిపోగానే…కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు.
ఓ …అంటే నీకు చాలా మంది మీదే కోపం వచ్చిందిరా..అన్నాడు తండ్రి కొడుకుతో…!?
ఆ… అయితే…. రేపటి నుండి రోజుకు కొన్ని మేకుల చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయ్ అన్నాడు కొడుకుతో తండ్రి…
తండ్రి చెప్పినట్టే…కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు… కొన్ని మేకులు తొలగించడానికి
చాలా కష్టపడ్డాడు.
ఏమయ్యిందిరా? అని అడిగాడు కొడుకుని తండ్రి….. గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాను నాన్న అన్నాడు కొడుకు..
మరి గోడ ఎలా ఉందిరా? మేకులైతే తీసేశాను కానీ..వీటి వల్ల గోడలకు అయిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్నా అన్నాడు కొడుకు.
అప్పుడు తండ్రి..కొడుకు తో..” చూశావా.. మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావ్.! తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసినా రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి….
అంటే మనకి చాలా మంది మీద కోపం వస్తుంది,
ఆ కోపంలో వాళ్ల మనస్సును గాయపరుస్తాం…
( అంటే మేకులు కొడతాం), తర్వాత సారీ చెప్పేస్తాం ( అంటే కొట్టిన మేకులు తీసేస్తాం),
కానీ సారీ చెప్పనంత మాత్రన వారి మనస్సు అయిన గాయం (అంటే రంధ్రాలను ) మాత్రం పూడ్చలేం.
అందుకే మాట-తూటా లాంటిది,
ఆచితూచి మాట్లాడుదాం,
ఇతరులను నొప్పించకుండా మాట్లాడుదాం-
ప్రేమగా మాట్లాడుదాం.
(నచ్చితే మరికొంతమంది మీ మిత్రులుకు షేర్ చేయండి..వారు కూడా గోడలకు మేకులు కొట్టడం తగ్గిస్తారు )
#yes it's true 💯% #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #📝జీవిత గుణపాఠాలు😊 #life lessons


