ShareChat
click to see wallet page
search
ఇదేమి ఒక సినిమా కధ కాదు. అస్సాం రాష్త్రంలో (తిన్సుకియా జిల్లా) జరిగిన ఒక అద్భుతం: సోబెరాన్ అనే ౩౦సమ్వత్సరాల యువకుడు కూరలు అమ్ముకుని జీవిస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఒక రోజు సాయంత్రం అతను కూరలు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తుంటే, రోడ్ ప్రక్కన వున్న పొదలనుండి ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. అక్కడకి వెళ్లి చూస్తే, ఒక చెత్తగుట్ట మీద రోజుల అపుడే వదలిన అమాయక శిశువు ఏడుస్తూ కనిపించింది. సోబెరెన్ చుట్టూ చూస్తే ఎవరూ కనిపించ లేదు. పిల్ల చాలా ముద్దుగా అందంగా వుంది. ఏం చెయ్యాలో తెలియక తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇక అతను పెళ్లి చేసుకోదలచుకోకుండా ఆ పాపను పెంచుకునేందుకు నిశ్చయించుకున్నాడు.. ఆ పాపకి "జ్యోతి" అని పేరు పెట్టాడు. ఆ పాపని పెంచటానికి అతను రాత్రి-పగలు కష్టపడి, జ్యోతికి ఏ కష్టమూ లేకుండా పెంచాటానికి సిద్ధమయ్యాడు. .స్కూల్ కి పంపాడు.ఆ పాప అవసరాలు అన్నీ తీర్చాడు. అతను ఆకలితో వున్నా, ఆమెకు ఏ కష్టం తెలియనిచ్చేవాడు కాదు. 2013లో జ్యోతి కంప్యూటర్ సైన్సు పట్టభద్రురాలు అయ్యింది. కాంపిటీటివ్ పరీక్షలకి తయారవుతుంది. 2014 లో public service కమిషన్ పరీక్ష వ్రాసి, ఆమె ఉత్తీర్ణురాలైంది. Income-tax డిపార్టుమెంటు లో Assistant Commissioner గ ఉద్యోగం వచ్చింది.. తను చేయలేనిది, తన కళలు నెరవేర్చిన తన కూతురిని జ్యోతి చూసి సోబెరాన్కి ఆనంద భాష్పాలురాలినాయి. జ్యోతి తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నది. ఆమె ఎంత చెప్పినా వినకుండా, అతను ఇంకా ఆ కూరగాయల వ్యాపారం చేసుకుంటూనే వున్నాడు. పత్రికలు, మీడియా వాళ్లకి సోబెరాన్ చెప్పేదేమంటే -"ఆ చెత్త కుప్ప నుండి ఒక ఆడపిల్లను నేను తేలేదు. నేను తెచ్చుకున్నది ఒక "వజ్రం" . అదే నా జీవితానికి ఒక "జ్యోతి". ఈ క్రిది ఫోటోలలో వున్నవారే వీరు... Both are Really Inspiring People....... #మహానుభావులు #mahanubhavulu🙏🙏🙏 #endharo mahanubhavulu #mahanubhavulu #endharo mahanubhavulu andhariki🙏🙏🙏
మహానుభావులు - ShareChat