ShareChat
click to see wallet page
search
తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులే గెలిచి అధికారంలోకి రావడానికి *ప్రచారం కోసం మరియు మా మేనిఫెస్టో ప్రతీ కుటుంబానికి చేరడానికి* 33+1=34 వెబ్ సైట్లు డిజైన్ చేస్తున్నాను. 1 తెలంగాణ వెబ్ సైట్, 33 జిల్లాలకు 33 ప్రత్యేక వెబ్ సైట్లు. సెర్చ్ ఇంజిన్స్ ద్వార ప్రజలకు త్వరగా చేరడానికి SEO (Search Engine Optimization) చేస్తున్నాను. ప్రతీ గ్రామానికి,ప్రతీ వార్డుకు,ప్రతీ డివిజన్ కు ప్రత్యేక పేజీలు. మొత్తం 15 నుండి 20 వేల పేజీలతో డిజైన్ చేస్తున్నాము. మన రాష్ట్రంలో, మన దేశంలో జనాభాలో రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు 70% పైన ఉంటారు. వీళ్లు ఏ పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీకి, ఏ నాయకునికి ఓట్లు వేసినా రైతుల బ్రతుకులు, జీవితాలు మారడం లేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడం లేదు. భవిష్యత్ అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు రైతులకే వేసుకుంటే రైతులే ఎం.ఎల్.ఎ, ఎం.పి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అవుతారు. :: రైతుల కష్టాలు :: రైతులు తమ పంటలకు తామే ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదు. (ఉదా: వడ్లు, మక్కలు, కందులు, పల్లి, పెసర, పత్తి మొ//గు పంటలు) కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పంటలు పండించే రైతులకు తమ పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. ఉన్న కొద్ది మార్కెట్లు వ్యాపారుల చేతిలో ఉన్నాయి. రైతులు తమ పంటల్ని వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారులు రైతుల పంటలకు ధరలు నిర్ణయించే పరిస్థితి ఉంది. ఒక సిగరెట్ కంపెనీ వాడు, కూల్ డ్రింక్ కంపెనీ వాడు, మద్యం కంపెనీ వాడు, వస్తువుల్ని తయారుచేసే ప్రతీ కంపెనీ వాడు తమ వస్తువుల ధరల్ని వాళ్లే నిర్ణయిస్తారు. కానీ రైతులు మాత్రం తాము పండించిన పంటల ధరల్ని నిర్ణయించుకోలేకపోతున్నారు. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మైనింగ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, సినిమా మాఫియా మొ//వి పెరుగుతున్నవి! మోసపోవడమే తప్ప, మోసం చెయ్యడం తెలియని రైతులు అధికారంలోకి వస్తేనే రాష్ట్రాలు, దేశం మరియు దేశ ప్రజలు బాగుపడతారు. ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ చెయ్యడానికి మార్పు కోరుకునే వ్యక్తులు నాకు నిజాయితీ పరులైనటువంటి 119 ఎం.ఎల్.ఎ అభ్యర్థులు + 17 ఎం.పి అభ్యర్థులు = 136 మంది అభ్యర్థులు కావాలి. :: అందరిలో ఒక అనుమానం ఉంటుంది :: డబ్బులు ఖర్చుపెట్టకుండా ఎన్నికల్లో గెలవడం సాధ్యమా? అని!!!!!! అవును సాధ్యమే. ఒక నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు పోటీ చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గెలిచేది ఒక్కరే కదా. :: రైతుల్ని గెలిపించడానికి మూడు పద్ధతుల్లో వెళతాము :: 1. భావజాలవ్యాప్తి (ప్రచారం) చెయ్యడం ద్వారా రైతుల్ని చైతన్యపరచడం. రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు రైతులకే వేస్తే జరిగే మార్పు గురించి తెలియజేస్తాము. 2. రైతులనే ఎం.ఎల్.ఎ, ఎం.పి లు గా పొటీ చేసేలా చైతన్యం తీసుకు వస్తాము. 3. రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు రైతులకే వేసి రైతుల్ని ఎం.ఎల్.ఎ, ఎం.పి లు గా గెలిపించుకునే విధంగా రైతుల్లో చైతన్యం తీసుకువస్తాము. :: *గమనిక* :: ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెబ్ సైట్ అవుద్ది. డిజైనింగ్ చెయ్యడం పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతానికి లింక్స్ క్రియేట్ చేశాము. తెలంగాణ వెబ్ సైట్ లింక్ :: https://www.newsads.org/telangana #🔊తెలుగు చాట్‌రూమ్😍 #@jai telangana....💕 #telanga news #telanga folk #telanga 33 జిల్లాల వెబ్ సైట్ల లింకులు తెలంగాణ వెబ్ సైట్ లో ఉన్నాయి.
🔊తెలుగు చాట్‌రూమ్😍 - ShareChat
telangana state website
telangana state website