ShareChat
click to see wallet page
search
#విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 *ఉక్కు పోరాటం వైసీపీ చేతికి..❗* 19.08.2025🎯 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది అరవై ఏళ్ళ క్రితం ఒక బలమైన నినాదం. ఆ నినాదం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించింది. ఆనాటి ఉక్కు మహిళ దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీని సైతం పోరాటం కదిలించింది. దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల ఆంక్ష అలా నెరవేరింది. అయితే ఆది నుంచి ఎన్నో అవాంతరాల మధ్య విశాఖ ఉక్కు కర్మాగారం సాగుతోంది. సొంత గనులు లేకపోవడం పెద్ద లోటు. లాభాలను ఆర్జించే సామర్థ్యం ఉన్నా కాళ్ళూ చేతులూ కట్టేసినట్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నో సార్లు బలిపీఠం ఎక్కిన విశాఖ ఉక్కుకు గత నాలుగైదు ఏళ్ళుగా గడ్డు రోజులే దాపురించాయి. ప్రైవేట్ విషయంలో ఎలాగైనా ముందుకు సాగాలన్న పాలకుల ఆలోచనల ముందు ఉక్కు ఉద్యమం గెలుస్తుందా లేదా అన్నదే ఇపుడు అందరికీ కలిగే సందేహం. ఒక వైపు ప్రైవేట్ లేదంటూనే మరో వైపు చేయాల్సింది చకచకా చేస్తున్నారు. దాంతో విశాఖ ఉక్కు భవిష్యత్తు అగమ్యగోచరం అవుతోంది. తాజాగా ఉక్కులో 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించారు. దాంతో మరోసారి ఉక్కు విషయంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీయమని అంటోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపం కూటమి ప్రభుత్వానిదే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కులో 32 విభాగాలను ప్రైవేటీకరణ చేసే దిశగా టెండర్లు పిలవటం ద్వారా ఎన్నికలకు ముందు ఉక్కు కార్మికులుకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి మోసం చేసింది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రులు హక్కు అయిన విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకునే విదంగా కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవాలని వైసీపీ నేతలు డిమాండు చేస్తున్నారు. అదేవిధంగా తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. 32 విభాగాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలు ప్రజలతో కలిసి విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో వైసీపీ ఉద్యమిస్తుందని అంటున్నారు.
విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 - STRETAGIG SALE PTNL 9102 SAVE VIZAG SIEEL PLANT ೮೧೧೮ (5৮ పాక 00"21 SAVE VIZAG STEEL IVE PLANT 0 07242 STRETAGIG SALE PTNL 9102 SAVE VIZAG SIEEL PLANT ೮೧೧೮ (5৮ పాక 00"21 SAVE VIZAG STEEL IVE PLANT 0 07242 - ShareChat