🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 06 - 12 - 2025,
వారం ... స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
*_నేటి మాట_*
*మానవ జన్మ సార్థకం చేసుకోవడం ఎలా???*
జప, ధ్యాన, యోగముల కంటె కూడను సేవనే అతి శ్రేష్టమైనటువంటి యొక్క సత్యాన్ని మీరు గుర్తించాలి.
ఈ కర్మల ద్వారానే మానవుని యొక్క జన్మము సార్ధకము గావించుకోడానికి అవకాశం ఉన్నది.
"మన కర్మనే మన ముక్తి, మన కర్మనే మన భుక్తి, మన కర్మనే మన యుక్తి, మన కర్మనే మన యొక్క భక్తి"...
🎵 *కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృధ్ధి పొంది*
*కర్మమునే చనున్*
*కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దు:ఖములకు*
*కారణమిలలో... కారణమిలలో..* 🎵
సర్వ ఫలములకును మూలాధారమై, కేంద్రమై, కీలకమైనటువంటి యొక్క కర్మను మనము నిష్కామ కర్మగా రూపొందింపచేసుకోవాలి.
మనము ఫలితమును ఆశించక, నా కర్తవ్యము ఇదియని, నా జన్మకు సరియైన మార్గమే ఇదియని మనం విశ్వసించి ఆ కర్మలో మనం నడవాలి.
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023


