#🚘వైరల్ యాక్సిడెంట్స్ వీడియోస్ VIDEO: రీల్స్ కోసం ఇలా చేస్తారా?
సోషల్ మీడియా రీల్స్ కోసం కొందరు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. హరియాణాలో కొందరు యువకులు థార్ కారుపై నిలబడి రోడ్డుపై హల్ చల్ చేశారు. అయితే ఎదురుగా వస్తోన్న ట్రక్కును తప్పించబోయి డ్రైవర్ బ్రేక్ వేయడంతో వారంతా రోడ్డుపై పడిపోయారు. ట్రక్కు డ్రైవర్ కూడా వెంటనే బ్రేకులు వేయడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. లైక్స్ కోసం ఇలా రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం సరికాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨

