ShareChat
click to see wallet page
search
కాశీ క్షేత్ర మాహాత్మ్యం.......!! కాశీ క్షేత్రప్రవేశం చేయడానికి , కాశీవాసం పొందటానికి మానవుడికి ఉండవలసిన అర్హతలు..! కాశి కాశీతి కాశీతి త్రివారం యః పఠేన్నరః! శోపి దేశాంతరే వాసి కాశీవాస ఫలం లభేత్!! అని చెప్పబడియుంది. కాశీ! కాశీ!కాశీ! అని మనం ఎక్కడినుండియైనా సరే తలుచుకొన్నా కూడా కాశీలో ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. సనాతనధర్మాన్ని అనుసరిస్తున్న మనమందరమూ కూడా కాశీక్షేత్రములో కొంతకాలమైనా నివశించాలని ప్రఘాడంగా కోరుకోవాలి. తల్లిగర్భంలో ఎంతకాలం బిడ్డ ఉంటుందో కనీసం అంతకాలమైనా కాశీలో ఉండాలని మనపెద్దలు చెపుతారు, అంటే 9నెలల కాలం. ఈనాటి కాలపరిస్థితులరీత్యా అంతకాలం ఉండలేని వారు 9రాత్రులైనా కాశీలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంతటి మహాపుణ్యక్షేత్రమైన ఈకాశీకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, చేయవలసిన కర్తవ్యమేమిటి. చేయకూడని పనులు ఏమిటి అని సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య స్వామివారే అగస్త్యమహర్షితో చెపుతున్న ధర్మాలను తెలుసుకొనే ప్రయత్నం.. విశ్వేశం మాధవం డుణ్డిం దండపాణించ భైరవం! వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం!! (ప్రాతస్మరణ ఈశ్లోకం ప్రతిరోజు నిద్దుర లేస్తున్నప్పుడు తప్పకుండా చదవండి). సుబ్రహ్మణ్యుడు అగస్త్యమహర్షితో చెపుతున్న కాశీక్షేత్ర మహత్యం. ఓ అగస్త్యా! క్షేత్రములలోకెల్ల, ఉత్తమక్షేత్రము, మంగళములోకెల్ల పరమమంగళము, స్మశానములోకెల్ల మహాస్మశానము, పీఠములలోకెల్ల పరమపీఠము, ధర్మాభిలాషులకు ధర్మరాశిని, అర్థార్థులకు పరమార్థాన్ని, కామార్థులకు సర్వాభీష్టములను, ముముక్షువులకు మోక్షాన్ని ప్రసాదించునది ఈ అవిముక్త క్షేత్రమైన వారణాసిక్షేత్రము. మహాసిద్ధిని ప్రసాదింపచేయని అణుమాత్ర స్థలమైనా కాశీయందు లేనేలేదు. ఈలోకమలో పవిత్రము చేయు అనేకతీర్థములు ఉన్నాకూడా, అవియన్నియు కాశీలోని దూళికణముతో సమానము కావు. భూమియందు మోక్షక్షేత్రములు ఎన్నియో ఉన్నవి. అవిముక్త కాశీక్షేత్రములో కోట్యంశ పుణ్యలేశము కూడా వాటికి లేదు కదా! గంగా-విశ్వేశ్వరుడు-కాశీ ఈముగ్గురూ ఎక్కడ జాగరూకులైయున్నారో అక్కడ మోక్షలక్షి సిద్ధిస్తుందనడంలో ఆశ్చర్యము ఏమియూ లేదు. *అగస్త్యమహర్షి మరల సుబ్రహ్మణ్యస్వామిని ఇలా ప్రశ్నించెను. ఓ స్కంద! గంగ-విశ్వేశ్వరుడు-కాశీ అనే ఈత్రయిని చంచలమైన బుద్ధికలిగిన మానవులు విశేషించి ఈకలియుగమున ఎలా పొందగలరు? జపములు తపములు, దానములు, వ్రతములు ఏవైనా ఉన్నవా? ఇవేవి చేయకుండానే, ఇంతటి కష్టపడకుండానే, ఈత్రయములను పొందడానికి తగిన ఉపాయము ఏమైనా ఉన్నదా? కాశీక్షేత్రములో కాలుమోపాలంటే కొన్ని కోట్ల, కోట్ల, కోట్లజన్మముల పుణ్యరాశి ఉండాలట. ఓం నమః శివాయ..ఓం నమః శివాయ. ఓం నమః శివాయ..ఓం నమః శివాయ.. #kasiviswanath #శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామి వారు వారణాసి #varanasi #చిదానంద రూప శివోహం శివోహం #ఓం శివోహం... సర్వం శివమయం
kasiviswanath - )( )( - ShareChat