ShareChat
click to see wallet page
search
పుణేలో ఓ దినసరి కూలీ తన భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించాడు, సిజేరియన్ కావడంతో "ఫీజు ఎంత అవుతుంది?" అని డాక్టర్‌ని ఆందోళనగా అడిగాడు. డాక్టర్ నవ్వి ఊరుకున్నాడు. భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చాక "అమ్మాయా లేక అబ్బాయా?" అని డాక్టర్‌ని అడిగాడు. “మహాలక్ష్మి” అని డాక్టర్ బదులిచ్చారు. “ఫీజు ఎంత?” అని అడిగాడతను. “లక్ష్మిదేవి పుడితే నేను ఎలాంటి ఫీజు వసూలు చేయను" అని డాక్టర్ అన్నారు. ఆ వ్యక్తి “సార్, మీరు దేవుడు” అని డాక్టర్ పాదాలపై పడ్డాడు. డాక్టర్ గణేష్ రాఖ్ గత పదేళ్ళుగా దంపతులకు ఆడపిల్ల పుడితే అతను ఒక్క పైసా కూడా తీసుకోరు. ఇప్పటివరకు అతను 1,000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పురుడు పోశారు. "ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. నువ్వు డాక్టర్ అయ్యాక వారిని కాపాడాలి అని మా అమ్మ చెప్పింది" అని అతను గర్వంగా చెప్పాడు. డాక్టర్ రాఖ్ యొక్క "సేవ్ ది గర్ల్ చైల్డ్" క్యాంపెయిన్ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మార్పును ప్రేరేపించింది. #endharo mahanubhavulu andhariki🙏🙏🙏 #మహానుభావులు #mahanubhavulu #endharo mahanubhavulu #mahanubhavulu🙏🙏🙏
endharo mahanubhavulu andhariki🙏🙏🙏 - ShareChat