#🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #పొలిటికల్ ట్రోల్స్.. 😂 రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయం
కాంగ్రెస్ లో మొదలైన అసమ్మతి రాగం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖరారైన నేపథ్యంలో ఆఖరి అస్త్రంగా మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ప్రకటించాడు రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీగా గవర్నర్ నుండి ఇంకా ఆమోదం పొందని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం...రేపటి రోజున గవర్నర్ ఆయన
అభ్యర్థిత్వాన్ని ఆమోదించపోతే ఆ మంత్రి పదవి రద్దవుతుంది... ఇన్ని తెలిసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు అంటే మైనారిటీలను మోసం చేయడమే
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం మొదలైంది...మైనారిటీ కోటాలో మంత్రి పదవికి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ మాత్రమే అర్హుడనీ...
అజారుద్దీన్ ఎన్నికలు ఉంటేనే కనబడతాడనీ, పార్టీ పదవుల్లో కీలక బాధ్యతల్లో ఉంటాడు కానీ ఆయన పనితనం అస్సలు బాగోదని...అయినా ఓడిపోయిన వారికి అవకాశం ఉండదని గతంలో పార్టీ చెప్పిందని మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకొని ఇప్పుడు మంత్రి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు
ఓడిపోయిన వారికి పదవులు కల్పించేది ఉంటే ముందు వరుసలో ఉండాల్సింది జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్ లనీ...వారిని కాదని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఎలా ఇస్తారని పార్టీ నేతలు అంటున్నారు
ఎప్పటినుండో మంత్రి పదవిని ఆశించి భంగ పడుతూ వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నాడు...ఇక ఇప్పటి నుండి తన అసమ్మతి రాగాన్ని మరింత పెంచనున్నాడు


