#నాడు - నేడు!!!
*మొదటి డైలాగ్... ప్రజలే మా దేవుళ్లు..*
*ప్రజాసేవే మా ఊపిరి..*
అందులో నిజం మాత్రం...దీని అర్ధం మాత్రం..
ఆర్థిక దోపిడీలే మా ప్రజాసేవ..
అవినీతే మా ఆరోప్రాణం..
వారి వారసత్వం రాజభోగాలు రాచరిక మర్యాదలే..
ఎవరన్నారు బ్రిటీష్ వాళ్లు వెళ్లి పోయారని..
వారి ఆనవాల్లను
పిల్ల ఎరువు కలుపు మొక్కల
విత్తనాలను చల్లి వెళ్లారు..
అవి మహా వృక్షాలై ఎదిగి తాండవమాడుతున్నాయి ఇంకా ఇంకా కలుపుమొక్కల
విత్తనాలను చల్లుతూ...
ఈ కలుపు విషపూరిత మొక్కలవ్రేళ్లు
మానవ జలగలై పాకుతూ
ప్రజల రక్తాన్ని పీలుస్తూనే బ్రతుకుతున్నాయి..
జలగలు చెడురక్తాన్నే పీల్చుకుంటాయి ఆహారంగా..
కాని ఈ మానవ విషపు జలగలు మాత్రం..
మంచి రక్తాన్ని పీల్చితాగడమేగాక
చెడురక్తాన్ని కూడా ఎక్కీస్తున్నాయి..
కలుపుమొక్కలను వ్రేళ్లతో పీకడమే
మనిషి అనే పదానికి నిజమైన అర్దం..
లేదంటే ఎక్కడపడితే అక్కడ దొరికింది తినే జంతువులకు మనకు తేడా ఏముంటుంది..
నా ఒక్కనివలనే దేశం మారిపోతుందా
అనుకునేవారి ఏఒక్కరి వలన దేశం మారదు..
నా ఒక్కనివలనే మారుతుంది అనుకుని ప్రతి ఒక్కరు ఆలోచించగలిగి
వారికి వారే కరెక్ట్ గా అన్యాయాన్ని
ఎదిరించినపుడే మారుతుంది...


