ShareChat
click to see wallet page
search
అన్ని సమస్యల నుండి రక్షించే శ్రీమహావిష్ణువు యొక్క 16 నామాలు..........!! శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రభాష్యం..!! ఔషధే చింతయేద్విష్ణుం: ఔషధం స్వీకరించే సమయంలో సర్వ వ్యాపకుడైన విష్ణువుగా స్మరించాలి! భోజనే చ జనార్ధనం: భోజనం చేసే సమయంలో జగద్రక్షకుడైన జనార్ధనుడిగా స్మరించాలి! శయనే పద్మనాభం చ: నిద్ర పోయే సమయంలో పద్మనాభుడిగా స్మరించాలి! వివాహే చ ప్రజాపతిమ్: వివాహ సమయంలో ప్రజాపతిగా స్మరించాలి! యుద్ధే చక్రధరం దేవం: యుద్ధంలో సుదర్శన చక్రం ధరించిన చక్రధారిగా స్మరించాలి! ప్రవాసే చ త్రివిక్రమమ్: ప్రయాణ సమయంలో త్రివిక్రముడుగా స్మరించాలి! నారాయణం తనుత్యాగే: అంత్య కాలంలో జ్ఞానమనే వాసముగా గల నారాయణుడిగా స్మరించాలి! శ్రీధరం ప్రియసంగమే: ఇష్టమైన వారిని కలిసేటప్పుడు లక్ష్మిదేవిని వక్షస్థలం నందు గల శ్రీధరుడిగా స్మరించాలి! దుస్స్వప్నే స్మర గోవిందం: పీడ కలలు వచ్చినప్పుడు గోవర్ధన గిరిధారి అయిన గోవిందుడుగా స్మరించాలి! సంకటే మధుసూదనం: సమస్యలలో ఉన్నప్పుడు రాక్షసులైన మధుసూదనులను వధించిన మధుసూదనడుగా స్మరించాలి! కాననే నారసింహం చ: అడవులలో ఉన్నప్పుడు నారసింహుడుగా స్మరించాలి! పావకే జలశాయినం: అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు నీటిపై పవళించే జలశాయిగా స్మరించాలి! జలమధ్యే వరాహం చ: నీటి వల్ల సమస్య ఏర్పడినప్పుడు భూమిని నీటి నుండి రక్షించిన యజ్ఞవరాహమూర్తిగా స్మరించాలి! పర్వతే రఘునందనం: కొండలలో, పర్వతాలలో ఉన్నప్పుడు కోదండరాముడిని రఘునందనుడుగా స్మరించాలి! గమనే వామనం చైవ: బయటకు వెళ్ళేటప్పుడు రెండు అడుగులతో విశ్వాన్ని కొలిచిన వామనమూర్తిగా స్మరించాలి! సర్వ కాలేషు మాధవం: సర్వకాలసర్వావస్థల యందు శ్రీకృష్ణ పరమాత్మను మాధవుడిగా స్మరించాలి! ఇవి పరమ పవిత్రమైన శ్రీమహావిష్ణువు యొక్క 16 నామాలు. ఈ విష్ణు షోడశనామాలను ప్రతీరోజూ ఉదయం భక్తి శ్రద్ధలతో ఎవరు పలుకుతారో, వారి సర్వ పాపాలు తొలగి విష్ణులోకం లభిస్తుంది. #తెలుసుకుందాం #🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 #శ్రీ మహావిష్ణు 🪐 #🪐 శ్రీ మహావిష్ణు 🔱
తెలుసుకుందాం - ApankaX iNews ApankaX iNews - ShareChat