ShareChat
click to see wallet page
search
నేర్చుకున్న పాఠాన్ని ఆచరణలో పెట్టాలి కార్తిక్ సైకాలజీ పాఠాన్ని బోధిస్తున్నాడు. ఆరోజు చివరి పాఠం ఆ ఏడాదికి ఉన్నట్టుండి ఒక గట్టి ఈల వేసారు ఒక విద్యార్థి . కార్తిక్ పాఠాన్ని ఆపేసి ఎవరు ఈల వేశారు చెప్పండి అని అడిగాడు. ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేదు. కార్తిక్ ఇలా మొదలెట్టాడు. ఎవరు ఈల వేసారో నాకు ఇప్పుడు అనవసరం కానీ మీ అందరితో ఒక విషయాన్ని పంచుకావాలి అనుకుంటున్నాను. నిన్న నేను ఒక దారిలో వెళుతుండగా ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ కోసం అడిగింది. అప్పటికే చీకటి పడడంతో సరే ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపేద్దాం అని అనుకుని బండి పై ఎక్కించుకుని మాటలు కలిపాను ఆ అమ్మాయి తన గురించి చెప్పింది నేను నా గురించి చెప్పడంతో ఇద్దరికి మనసులో కలిసాయి. ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అని నిర్ణయం తీసుకున్నాము. కాని ఆ అమ్మాయి ఒక్క మాట చెప్పింది నా తమ్ముడిని ఒప్పించండి చాలు అని. సరే మీ తమ్ముడితో పరిచయం చేయించు అంటే ఇప్పుడు అయితే ఇంట్లో లేడు అయినా అతను మీ కాలేజీలో నే చదువుతున్నాడు పట్టుకోండి అంది. నేను ఎలా పట్టుకోవాలి అని అడిగితే మా వాడు ఈల వేయడం లో మహా దిట్ట అతని తో ఈల వేయడంలో ఎవరూ పోటీపడలేరు అని చెప్పింది. అంతే ఈల వేసినవాడిని అందరూ ఒక్కసారిగా తిరిగి చూసారు. అప్పుడు దొరికేసాడు ఈల వేసినవాడు. అప్పుడు కార్తిక్ మరొక్క మాట చెప్పాడు. నేను హ్యూమన్ సైకాలజీ బట్టి పట్టి చదవలేదు ఇష్టపడి చదివి ఈరోజు మీ ముందు ఉన్నాను అన్నాడు. మనం నేర్చుకున్న పాఠాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో కూడా తెలుసుండాలి #హహహ #హహహ😃😅😂🤣😄 #psychology #psychology facts #తెలుసుకుందాం
హహహ - KARTHIKI BC 2<3=6 4D [9 Li" M T 1 E / ! / ShAIPID b/I DIIII 33 6 { KARTHIKI BC 2<3=6 4D [9 Li" M T 1 E / ! / ShAIPID b/I DIIII 33 6 { - ShareChat