ShareChat
click to see wallet page
search
గురువు_లేకపోతే_అంతా_చీకటే..! గురువులేని విద్య అంధ విద్య అని, గురువు లేని వాడు అంధుడు తో సమానం అనే నానుడి ఉంది.. వ్యక్తికి తొలి గురువు అమ్మే, కానీ గురువు మాత్రం రెండో తల్లి. మనిషి రెండు సార్లు జన్మిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తల్లిదండ్రుల కలయికతో తొలిసారి... విశ్వసనీయమైన గురువును అంగీకరించడం ద్వారా రెండోసారి జన్మిస్తాడు. గాయత్రి మాత సహకారంతో వేద విజ్ఞానం, వ్యక్తిత్వం అలవరుచుకోవడంలో గురువు తండ్రి పాత్రను పోషిస్తాడు. జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి గురువు బోధనలు ఉపయోగపడతాయి. గురువే లేకపోతే అజ్ఞానం అనే చీకటిలోనే మనిషి కూరుకుపోతాడు. ఆచార్యుడు ప్రమాదం నుంచి మనల్ని కాపాడే వ్యక్తి కూడా. ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది హృదయోపాసన ద్వారా ముక్తిని సాధించే విద్యను ప్రవచించింది. దీనిలో మృత్యువే గురువు. ఇది మృత్యుంజయ విద్యను ఉపదేశించింది. శంకరాచార్యులు భాష్యం రాసిన పది ఉపనిషత్తులతో ఇది కూడా ఒకటి. వ్యక్తి తనకు తోచిన విధంగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన అనుభవం పొందుతాడు. మార్గంలో సూచనలు లేకపోతే ప్రయాణం దారి తప్పే అవకాశాలు ఎక్కువ. జ్ఞాన బోధ వల్ల జీవితానికి మార్గనిర్దేశం కలుగుతుంది. అది గురువు వల్లే సాధ్యం. అస్పష్టమైన ఆలోచనలుండే వ్యక్తి పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణం, అంధుడి ప్రయాణం లాంటిది. గురువు సమాచారం అందించి, మద్దతు ఇచ్చి సహాయం చేస్తాడు. గురువులు, పరమ గురువులు లేరని కొందరు వాదిస్తారు. తన గురించి తెలుసుకోవాలనే తపించువారికి గురువు దర్శనమిస్తాడు. ప్రతి సద్గురువు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. తన చుట్టూ చేరిన శిష్యులకు వారి నిజ స్వరూపాన్ని గుర్తుచేసి, అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకొనేటట్టు మార్గదర్శకత్వం చేస్తాడు. గురువు తన సాన్నిధ్యం శిష్యుడిలో మార్పునకు శ్రీకారం చుడుతుంది. అది అయస్కాంతం వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పు లాంటిది. మానవజాతి మొదలైనప్పటి నుంచి గురుశిష్య పరంపర ఆరంభమైంది. యోగశాస్ర్తం ప్రకారం ‘సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే గురువులందరికీ గురువు. సమస్త జ్ఞానానికి, పరిపూర్ణతకు అతడే బీజం’.గురువు అనే తత్త్వం లేక సిద్ధాంతం గురువు రూపం ద్వారా పనిచేస్తుంది. పూర్వ కాలంలో శిష్యులకు గురువు బాధ్యతలను అప్పగించేవాడు. ఇక్కడ గురువు చెప్పిన పనిని, ప్రశ్నించకుండా శిష్యుడు చేయాలి. కాని నేటి తరంలో శిష్యులకు స్వతంత్రం ఎక్కువైంది. వేదకాలంలో గురువులను శిష్యులు నిత్యం ప్రసన్నం చేసుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయినంత వరకూ శిష్యుడు గురువు సంరక్షణలో ఉండేవాడు. #తెలుసుకుందాం #🌺🙏Sri Guru Dakshinamurthy🙏🌺 #Sri Dakshinamurthy Swamy #om sri gurubhyo namaha
తెలుసుకుందాం - SRIDAKSHIN SRIDAKSHIN - ShareChat