బంధాలకు కొన్ని..
అనుబంధాలకు మరికొన్ని..
ప్రేమాభిమానాలకై కొన్ని..
ఆత్మీయతానురాగాలకై మరికొన్ని..
అయినవారి కోసం కొన్ని..
కాని వారి కోసం మరికొన్ని..
లెక్క లేనన్ని కన్నీటి బిందువులు రాలుతుంటే
హృదయం ఎంత భారంగా ఉండేదో !
నీ సేవకోసం పరితపిస్తూ..
నీ దర్శనం కోసం ఎదురుచూస్తూ..
నీ అనుగ్రహానికై పరితపిస్తూ..
నీ పిలుపుకోసం నిరీక్షిస్తూ..
జనించిన ప్రతి కన్నీటి బిందువుతో మనసు
ఎంత తేలిక పడుతున్నదో!
నా ప్రతి కన్నీటిచుక్కతో..
నీ పదములు కడిగనివ్వు..
హృదయ భారం తగ్గనివ్వు..
మనసు తేలిక పడనివ్వు..
నా జన్మ చరితార్థం కానివ్వు.. 🙏🏻
#💗నా మనస్సు లోని మాట #భగవంతుడు #భగవంతుడు #భగవంతుడు భక్తుడు #భగవంతుడు సర్వంతర్యామి 🙏🙏🙏