ShareChat
click to see wallet page
search
*వ్యాస మహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాలలో* *గరుడపురాణం* *ఒకటి...ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందినది..శ్రీ మహావిష్ణువు తనకు అత్యంత ఇష్టుడైన గరుత్మంతునికి ఈ పురాణాన్ని ఉపదేశించాడు*..*అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది*..*ఈ పురాణంలో మొత్తం* *18000 వేల శ్లోకాలు ఉన్నాయి*....*మానవుడు పుట్టిన నాటి* *నుండి మరణం* *సంభవించినంతవరకు చేసిన పాప ఫలితాలు శిక్షలు ఎలా ఉంటాయో ఈ పురాణంలో వివరంగా చెప్పబడింది....* *గరుడపురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది* *_మరణించిన తర్వాత......._* *మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఒకటి... పూర్వఖండం. రెండోది ఉత్తర ఖండం..* *_ఏ తప్పునకు ఎలాంటి శిక్ష_* *పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి*. *ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు*. *ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు.గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పునకు ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలుసుకుందామా* *_1...తమిశ్రం._* *గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను శిక్షించడం. దీని ప్రకారం శిక్ష చాలా గోరంగా ఉంటుంది. యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మచీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు*. *_2..కుంభీపాకం_* *కుంభీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకుని.. సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగిపాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు.* *_3. రౌరవం_* *రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది*. *_4..మహారౌరవం_* *న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు. ఇక అంధతమిశ్రం ప్రకారం.. స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వదిలిపారేసే వారిని శిక్షిస్తారు. భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.* *_5..అసితపత్రవనం_* *అసితపత్రవనం ప్రకారం విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. సూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు*. *_6..అంధకూపం_* *అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్లని బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు*. *_7..తప్తమూర్తి_* *నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు*. *_8..క్రిమిభోజనం_* *క్రిమిభోజనం ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు*. *_9.. శాల్మలి_* *ప్రకారం వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వారు శిక్షించబడతారు.* *_10..వజ్రకంటకశాలి_* *జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారు వజ్రకంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు*. *_11..వైతరణి ప్రకారం_* *అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు*. *_12...పూయోదకం_* *వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది* *_12...ప్రాణరోధం_* *కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది*. *_13..వైశాసనం_* *పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు* *_14..లాలభక్షణం_* *అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు.* *_15..సారమేయాదానం_* *ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.* *ఇక అవీచి ప్రకారం.. శిక్ష చాలా కఠినంగా ఉంటుంది* *నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం అవీచి ప్రకారం శిక్షిస్తారు*. *_16..అయోపానం_* *ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి* *_17..రక్షోభక్ష_* *జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారికి శిక్ష విధిస్తారు*. *_18..శూలప్రోతం_* *ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను శూలప్రోతం లోకి పంపుతాడు యముడు*. *_19..క్షరకర్దమం_* *మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను శిక్షిస్తారు.* *_20..దందశూకం_* *తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు*. *_21..వాతరోదం_* *అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు*. *_22..పర్యావర్తనకం_* *ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు*. *_23...సూచీముఖం_* *గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు శిక్ష అనుభవిస్తారు*. *_సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - 11.20 11.20 - ShareChat