#🙏ఓం నమో వేంకటేశాయ 🙏
నీ కష్టం చెప్పుకోవడానికి నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో..
ఆ కష్టం తీర్చడానికి నా తండ్రి స్వామి అన్ని మెట్లు దిగి వస్తాడు..
మొక్కిన వారికి దిక్కు నీవు..
అడిగినవారికి ఆపద్బాంధవు నీవు..
పిలిచిన వారికి పరమాత్మవు నీవు..
ఆర్తి కలిగిన వారికి అంతరాత్మవు నీవు..
ముక్తి కోరేవారికి గమ్యం నీవు..
అన్నిటికి నీవే కదా దిక్కు గోవిందా..
ఒకనాడు నిన్ను దైవంగా కొల్చాను..
మర్నాడు నిన్ను సర్వంగాభావించాను..
నేడు నా తండ్రిగా నిలుపుకున్నాను..
ఆ బంధం కన్నా గొప్ప బంధం ఏముంది స్వామీ..
ఆపదమొక్కులవాడు..
అడుగడుగున దండాల వాడు..
ఏడుకొండలస్వామి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు..
నమో నమః గోవింద హరి గోవిందా..🙏


