ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #వైసీపీ *పాతాళం నుంచి వైసీపీ ……❗* SEPTEMBER 10, 2025🎯 కూటమి ఏడాది పాలన సాధించిన విజయం ఏదంటే... ప్రతిపక్ష వైసీపీలో భయం పోగొట్టడం. అలాగే భవిష్యత్ పై వైసీపీలో ధీమా కలిగించడం. ఇవాళ వైసీపీ కదం తొక్కుతోందంటే ...ఆ ఘనత ముమ్మాటికీ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. పంటల సాగుకు ఎరువుల కొరత, అలాగే గిట్టుబాటు ధరలు లేకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో తలపెట్టిన అన్నదాత పోరు విజయవంతమైంది. ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన వైసీపీ కేవలం 15 నెలల్లో రోడ్డెక్కడానికి, అలాగే జనం పెద్ద ఎత్తున వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. బ్రహ్మాండమైన పాలన సాగిస్తుందని అందరూ ఊహించారు. పాలనలో వైసీపీ చేసిన తప్పుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి చేయదని జనం అసుకున్నారు. అలాగే 2014-19 మధ్య కాలంలో సిఎంగా చంద్రబాబు చేసిన తప్పుల్ని పునరావృతం చేయరని ప్రతి ఒక్కరూ భావించారు. అదేంటో గానీ, కూటమి కార్యకర్తలు, సామాన్య ప్రజల ఆశలు, నమ్మకాలు ఏడాదిలోనే తలకిందులయ్యాయి. సీఎం చంద్రబాబేనా ఈ పని చేస్తున్నదని నిత్యం ప్రశ్నించుకునే పరిస్థితి ఉదాహరణకు వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారు. అందులో ఐదింటిని ప్రారంభించారు. మరో ఐదు కళాశాలల నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకున్నాయి. అలాంటి వాటిని పూర్తి చేసి, మన పిల్లలకు ఉచితంగా వైద్యం అందించాల్సింది పోయి, ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత కంటే, గొప్ప ప్రయోజనాలు కూటమి పెద్దలకు ఏమున్నాయో అంతుచిక్కడం లేదు. అలాగే రైతుల విషయంలో కనీస ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకోగానీ, కూటమి పాలకులో ప్రజలకు మేలు చేయడం కంటే, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇతర ప్రయోజనాలు పొందడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎడాదిలోనే పాలన గాడి తప్పిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల అరాచకాలు అన్నీఇన్నీ కావు. వీళ్ల కంటే, వైసీపీ వాళ్లే కొద్దోగొప్పో నయం అనుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హెచ్చరికల్ని కూడా ప్రజాప్రతినిధులు ఖాతరు చేయని పరిస్థితి సహజంగా చంద్రబాబు మంచి పరిపాలనా దక్షుడని పేరు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు... ఆ మంచి పేరు కాస్త పోగొట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూటమి చేయిదాటిపోతోందన్న చర్చకు దారి తీసింది. కూటమి ఫెయిల్యూర్స్, వైసీపీలో జోష్ నింపుతున్నాయి. నిజానికి 11 సీట్లకు పడిపోయిన వైసిపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోలుకోలేని పరిస్థితి అయితే కూటమి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, దోపెడీలు వైసీపీకి ఊపిరి పోస్తున్నాయి. పాతాళంలోకి పడిపోయిన వైసీపీ ___.శరవేగంగా భూమిపైకి వచ్చింది. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోంది. తమదే అధికారం అంటూ ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులపై క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం శరవేగంగా పడిపోతోంది. కూటమి శ్రేణుల్లోనే సానుకూలత లేకపోవడం, అత్యంత ప్రమాదకరమనే సంగతిని వారు గ్రహించాలి. ఇదే పాలన మరో ఏడాది గడిస్తే, కూటమి చాప చుట్టేయడం ఖాయం అనే మాట మూడు పార్టీల కార్యకర్తలు, నాయకుల నుంచి రావడం గమనార్హం. మంచి పాలనను ప్రజలు కోరుకుంటారు. భస్మాసుర హస్తం అవుతామంటే, నెత్తిన పెట్టుకోడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించుకోవాలి.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat