#😓ఘోర ప్రమాదం..చాలా మంది భారతీయులు మృతి #💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #BRS party #kcr ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కేసీఆర్ సంతాపం
♦️ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలంగాణ వాసులు మరణించడం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
♦️ ఉమ్రా యాత్రలో భాగంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు, అగ్ని ప్రమాదానికి గురయ్యి అందులో ప్రయాణిస్తున్న 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు.
♦️ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు.
♦️ మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు.
♦️ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్ గారు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


