🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 19 - 11 - 2025,
*_నేటి మాట_*
*ఆత్మా రాముని అనుగ్రహము కావాలంటే ఏమి చేయాలి??*
మానవ జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు మిత్రులు అంతా మనమున్న బోగీలో మనతో పాటు ప్రయాణించే ప్రయాణికులు వంటివారు...
ఎవరు దిగాల్సిన స్టేషన్ వారికి వచ్చినపుడు చక్కగా దిగి వెళ్ళిపోతారు.
అంతవరకూ మనతో మాటామంతి కలిపినా, మనకోసం వాళ్లు దిగాల్సిన చోట దిగకుండా ఉండలేరు!
అలానే మనం కూడా దిగకుండా అడ్డుకొలేము కదా!
ఎవరైనా సరే కర్మననుసరించి కాలం చేయడం సహజం...
ఇట్టి పరిస్థితిలో మనం, ఎవరిపైననూ అమితంగా అభిమానము, మమకారము కలిగిఉండుట అత్మొద్ధరణకు అడ్డంకి తప్ప పురోగతి రాదని గ్రహించాలి...
మనసును మందపై కాక మాధవునిపై పెట్టుకోవాలి, ప్రాపంచిక విషయాలపై మోహావేశములను నియంత్రించి మోహనాకారుని యందు చిత్తమును నిలుపుకోవాలి.
అహంకారాది దుర్గుణములను వదులుకోవాలి, అత్మారాముని అనుగ్రహము కొరకు శ్రమించాలి,
దీనుల సేవయే దేవుని అసలైన సేవగా భావించి తరించడానికి ప్రయత్నం చేయాలి...
అప్పుడే ఆత్మా రాముని అనుగ్రహము కలుగుతుంది...
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023


