ShareChat
click to see wallet page
search
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *ముమ్మిడివరం నగరపంచాయతీ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్* గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారార్థం రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని *వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.* గత సెప్టెంబర్ 22వ తేదీన గౌరవ GSWS డైరెక్టర్ గారికి 15 రోజుల ముందస్తు సమాచారం నోటీసు సమర్పించగా,ఆ గడువు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 23వ తేదీ నుండి దశలవారీగా నిరసనలు చేపట్టనున్నట్టు ముమ్మిడివరం సచివాలయ ఉద్యోగులు ప్రకటించారు. ఇందులో భాగంగా 🇦‌🇵‌🇻‌🇼‌🇸‌🇪‌JAC రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ముమ్మిడివరం వార్డు సచివాలయ ఉద్యోగులు ఆఫీషియల్ వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులమైన తమకు అప్పగించిన విధులు నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. అయితే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాలంటీర్ విధులు మాకు అప్పగించబడటం మాకు చాలా బాధాకరమని తెలిపారు. *🔑 ప్రధాన డిమాండ్లు* GSWS డైరెక్టర్ గారిని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఎండీ. జానీ పాషా ఆధ్వర్యంలో ఇప్పటికే కలసి క్రింది ముఖ్య సమస్యలపై చర్చించినట్లు ఉద్యోగులు తెలిపారు: 1)ఇంటింటి సర్వే బాధ్యతలు తొలగించటం 2)నోషనల్ ఇంక్రిమెంట్లు 3)9 నెలల ప్రొబేషన్ కాలం యొక్క బకాయిలు విడుదల 4)జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు 5. FAC అలవెన్స్ 6. seniority ప్రకారం ప్రమోషన్స్ 7.జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు కేటాయింపు నిరసన లో భాగంగా, 29-09-2025న పెన్షన్ అమౌంట్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు అందరు తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి మేము వైదోలుతున్నాము. అయితే, వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలిగినప్పటికీ ప్రతిరోజూ గ్రామ/వార్డు సచివాలయ వర్కింగ్ అవర్స్ అందుబాటులో ఉంటాము అని తెలిపారు. "మా హక్కుల కోసం శాంతియుతంగా, సవ్యమైన పద్ధతిలో నిరసనలు నిర్వహించుకుంటాం. ప్రభుత్వ నుంచి సానుకూల స్పందన వచ్చినంత వరకూ మా పోరాటం కొనసాగుతుంది" అని ముమ్మిడివరం వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞ప్రభుత్వ సమాచారం📻 - ShareChat