ShareChat
click to see wallet page
search
#🌼9 రోజుల బతుకమ్మ🎉 #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #సద్దుల బతుకమ్మ #🌅శుభోదయం *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - బతుకమ్మ పండుగ : 9వ రోజు - సద్దుల బతుకమ్మ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *సద్దుల బతుకమ్మ* *━❀꧁ 🔆 ꧂❀━* ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు పసుపును వారి చెంపలకు రాసుకుంటారు. చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు. ఐదు రకాల సద్దులను నైవేద్యంగా పెడతారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ, దద్దోజనం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలను పొడి చేసి అన్నంతో సద్దులు కలుపుతారు. బియ్యప్పిండితో గాని సజ్జపిండితో గాని రొట్టెలు కాలుస్తారు. వేడివేడి రొట్టెలకు పంచదార లేదా బెల్లం కలిపి దంచుతారు. ఈ పొడిని ముద్దలు చేస్తారు. వీటిని 'మలిద ముద్దలు' అంటారు. మలిదముద్దలు, పొడుల సద్ది, పెరుగుసద్ది, పులిహోరతో కలిపి మొత్తం ఐదు నుంచి తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా ఇస్తారు.
🌼9 రోజుల బతుకమ్మ🎉 - సద్దులబతుకమ్మశుభాకారక్షలు సద్దులబతుకమ్మశుభాకారక్షలు - ShareChat